ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు
 
రోబోట్లను నిర్మిస్తున్న బాలలు
WD PhotoWD
ప్రపంచ రోబోట్ ఒలింపియాడ్‌తో దేశంలోని స్కూళ్ళు , విద్యార్థులకు రోబోట్లను పరిచయం చేయాలని తహతహలాడుతున్నాయి. అంతేకాక రోబోట్‌కు సంబంధమున్న అంశాలను విద్యార్ధులకు బోధించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. నవంబర్ మాసంలో తైవాన్ నగరంలో జరిగే ప్రపంచ రోబోట్ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన స్కూలు విద్యార్థులు ఎంపికయ్యారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియన్ రోబోటిక్ ఒలింపియాడ్‌లో 180 స్కూళ్ళకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గత సంవత్సరం జరిగిన ఒలింపియాడ్‌లో 18 స్కూళ్ళు మాత్రమే పాల్గొన్నాయి. ఈ పోటీలలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన రోబోటిక్స్ కిట్‌లను విద్యార్థులకు అందిస్తారు. ఆర్గనైజర్స్ సూచనలతో విద్యార్థులు రోబోట్లను తయారు చేయవలసి ఉంటుంది.

కంప్యూటర్ విడి భాగాలను కలిగిన 'లేగో' కిట్‌తో విద్యార్ధులు నిర్మించిన రోబోట్లు ప్రత్యేకమైన పనులను చేస్తాయి. ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కు నడవడం, దారిలో అడ్డంకులను గుర్తించగలగడం తదితర పనులను చేసే విధంగా రోబోట్లను రూపొందించాలి.

నవంబర్ మాసంలో తైవాన్ నగరంలో జరిగే ప్రపంచ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత్ తరపు ప్రతినిధులుగా ముంబై, న్యూఢిల్లీ మరియు చండీగఢ్ నగరాలకు చెందిన స్కూల్ విద్యార్థులు ఎంపియకయ్యారు.
మరిన్ని
స్నేహమాధుర్యాన్ని చాటే 'ముకంద్-రియాజ్'
'జంగిల్ బుక్' డీవీడీ విడుదల
అండమాన్‌లో బాలల పార్లమెంట్
'గోడలపై నాట్యం' చేసే చిత్రాలు
ఆరోగ్యవంతమైన హృదయం కోసం...
బాలల కరదీపిక 'మాయా పాత్ర'