పిల్లల పెంపకంలో పెద్దల అతి జాగ్రత్త వారిని ఊబకాయులుగా, కంప్యూటర్‌కు బానిసలుగా మారుస్తున్నదని తాజా నివేదిక హెచ్చరిస్తున్నది. బ్రిటన్ పాలిత లేబర్ పార్టీ అవలంబిస్తున్న సంస్కృతి, పిల్లలను పెద్దలు ప్రమాదంలోకి నెట్టివేసే దోరణికి ఊతమిస్తున్నదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
మేధావులు 13 మాసాల పాటు చేపట్టిన అధ్యయన ఫలితంగా నివేదిక వెలువరించబడింది. పిల్లల రక్షణ ధ్యేయంగా కార్మిక శాఖ గత సంవత్సరం 33 చట్టాలను, 1,000కి పైగా నియంత్రణలను అమలులోకి తీసుకువచ్చింది. వాటిలో ఆరోగ్య చట్టం ద్వారా పబ్‌లు మరియు క్లబ్‌లలో ధూమపాన నిషేధం, శిశుసంరక్షణ చట్టం ద్వారా పొత్తిళ్ళ నుంచి పాఠశాలకు వెళ్ళేదాకా పెద్దలు తప్పనిసరిగా చేపట్టవలసిన బాధ్యతలు తదితరాలు ఉన్నాయి.
వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ప్రజలు మరియు మీడియా నుంచి వస్తున్న ఒత్తిళ్ళకు ప్రభుత్వం అతిగా స్పందిస్తున్నదని నివేదిక ఆరోపించింది.
|