ఫాస్ట్‌ఫుడ్ మోజులో పడిన ఢిల్లీలోని స్కూల్ విద్యార్ధులలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. డిల్లీ డయాబెటిస్ సెంటర్ నగరంలోని ఎనిమిది ప్రైవేట్ స్కూళ్ళలో ఈ అధ్యయనాన్ని జరిపింది. మూడవ తరగతి నుంచే పిల్లలు ఫాస్ట్‌ఫుడ్ పట్ల ఆకర్షితులవుతున్నారని, ఐదవ తరగతి చేరుకునేసరికి పిల్లల ఆహారపుటలవాట్లలో ఫాస్ట్‌ఫుడ్ ప్రధాన ఆహారంగా చోటు చేసుకుంటున్నదని తెలిపింది.
అధ్యయనంలో భాగంగా 1155 మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో 44 శాతం విద్యార్థులు రోజుకు కనీసంగా ఒక సాఫ్ట్ డ్రింక్‌ను తాగుతున్నట్లు తేలింది. అలాగే సర్వేలో పాల్గొన్నవారిలో 39 శాతం మంది ప్రతిరోజు బెర్జర్లు, సాఫ్ట్ డ్రింక్‌లను తీసుకుంటున్నట్లు వెల్లడయ్యింది. 31 శాతం విద్యార్థులు సాఫ్ట్ డ్రింక్‌తో పాటు పిజ్జాను స్వీకరిస్తున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే పండ్లను తీసుకుంటున్నారని తెలియవచ్చింది.
|