ఇటీవల ముగిసిన ఆసియా క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆరు పతకాలను సాధించిన పాఠశాల విద్యార్ధిని మహేశ్వరిని ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సన్మానించారు. పదహారేళ్ళ మహేశ్వరిని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
పాండిచ్చేరికి సమీపంలోని నెట్టపాకంలో గల కంబన్ ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో మహేశ్వరి ప్లస్ వన్ చదువుతున్నది. ఆసియా క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ సీనియర్ మరియు సబ్-జూనియర్ కేటగిరీలలో మహేశ్వరి మూడు బంగారు పతాకాలను, కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.
రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి వెయిటింగ్ పోటీలలో సైతం మహేశ్వరి తన విజయకేతనాన్ని ఎగురవేసింది.
|