బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న అత్యున్నతమైన లక్ష్యాలను అధిరోహించిన 36 మంది బాలలకు జాతీయ బాలల పురస్కారాలను అందచేస్తారు. 2006 సంవత్సరానికి గాను అందించే పురస్కారాలలో జాతీయస్థాయిలో ఒక బంగారు పతకాన్ని, రాష్ట్రస్థాయిలో 35 వెండి పతకాలను అందచేస్తారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ వారం రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించ తలపెట్టింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాలల కోసం ప్రత్యేకంగా చలన చిత్రాలను ప్రదర్శిస్తారు.
అంతేకాక సంబంధిత శాఖ మంత్రి రేణుకా చౌదరి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో మంత్రిత్వశాఖ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. పెవిలియన్‌పై రాష్ట్ర సాంస్కృతిక బృందాలు సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, మ్యాజిక్ మరియు పప్పెట్ ప్రదర్శనలను అందిస్తాయి.
|