1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

ఇవి చేస్తే... అద్భుతమైన జ్ఞాపకశక్తి మీసొంతం...!

బాలప్రపంచం కథనాలు విద్యార్థులు అద్భుతమైన జ్ఞాపకశక్తి విజయం అంచనా అధికం శ్రద్ధ ఓపిక అవలీల రుగ్మత
FileFILE
విద్యార్థుల విజయానికి మూలం జ్ఞాపకశక్తి. జ్ఞాపకశక్తి పైనే వారి విజయాన్ని అంచనా వేయవచ్చు. ప్రత్యేకించి విద్యార్థులలో జ్ఞాపకశక్తి అధికంగా ఉన్నవారు కొద్దిపాటి శ్రద్ధ, ఓపిక చూపిస్తే గొప్ప గొప్ప విజయాలను అవలీలగా అందుకోగలుగుతారు. విద్యార్థులు ఎవ్వరూ తమకు జ్ఞాపకశక్తి తక్కువ అని, అసలేవీ గుర్తుండవని అనుకోవడం కేవలం మానసిక రుగ్మత కిందికే వస్తుంది.

ఆసక్తి ఉన్న విషయాలన్నీ గుర్తున్నప్పుడు చదువుల సంగతి ఎందుకు గుర్తుండదు. ఏకాగ్రత అనేది పని విజయానికి ఎంతమేరకు సహకరిస్తుందో జ్ఞాపకశక్తి కూడా మన ప్రయత్నం సఫలీకృతం కావడానికి అంతే సహకరిస్తుంది. ఏకాగ్రతతో ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ పోతే అద్భుతమైన విజయాలను సాధించవచ్చు. అలాగే, కింద చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే అద్భుతమైన జ్ఞాపకశక్తిని మీ సొంతం అవుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా....!
చేయండిలా...!
  రేఖాపటాల ద్వారా వివిధ అంశాలను గుర్తుంచుకోవడం, పదం లేక వాక్యాల తాలూకు బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకొని జ్ఞాపకం చేసుకోవడం, మీరు ఏవైతే గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పదాలను ఒకే ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసుకుని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం...      


మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండాలి. అలాగే పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే ఇంట్లోని పరిస్థితులు సక్రమంగా ఉండాలి. చక్కటి ఆహారాన్ని వారికి అందించాలి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన చాలా అవసరం.

ఇందుకుగానూ, మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి. ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుక్కోవడం లాంటివి చేయాలి. అలాగే, లింకు పద్ధతి ద్వారా జ్ఞాపకం ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఫార్ములాలని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి.

ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం, పదాలు అంకెలు విడగొట్టడం, బట్టీ పట్టే విధానం, కుదించడం, వ్యాపించడం, ఫ్లాష్ కార్డులను ఉపయోగించటం లాంటివి చేయడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అలాగే... రేఖాపటాల ద్వారా వివిధ అంశాలను గుర్తుంచుకోవడం, పదం లేక వాక్యాల తాలూకు బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకొని జ్ఞాపకం చేసుకోవడం లాంటివి చేయాలి. ఇక మీరు ఏవైతే గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పదాలను ఒకే ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసుకుని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయాలి.

రకరకాల పాయింట్లను కలపడం ద్వారా వ్యాస ప్రశ్నల్లోని జవాబులను గుర్తుంచుకోవడం, చరిత్ర సైన్స్‌ చదివేటప్పుడు వివిధ నాయకులు, సైంటిస్ట్‌ల పేర్లను గుర్తు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వారు గుర్తుకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన విషయాలు కూడా గుర్తుకు వస్తాయి. వ్యాస ప్రశ్నలకు జవాబులను సులభంగా రాయవచ్చు.

ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే.... ఆటల ద్వారా కూడా రకరకాల విషయాలను జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కథల రూపంలో పేర్చుకుని గుర్తు పెట్టుకోవడం, పంచేంద్రియాల ద్వారా, హాస్యం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకునేలా ప్రయత్నించాలి.

అలాగే అర్థం చేసుకుని చదవడం అనేది ఒక మంచి టెక్నిక్. ఇలా అర్థం చేసుకుని చదవడం వల్ల సులభంగా జ్ఞప్తికి వస్తాయి. ఒక విషయం గురించి చిన్న చిన్న కాగితాలపై సంక్షిప్తంగా రాయడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఈ వ్యాసంలో చెప్పిన చిన్న చిన్న సూచనలను పాటిస్తే అద్భుతమైన జ్ఞాపకశక్తి మీ సొంతమవుతుంది. ప్రయత్నిస్తారు కదూ...!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి