ఇదివరకటి రోజుల్లో చిన్నారులు ఆటలకు ఓ హద్దూ.. పొద్దూ వుండేది కాదు. అయితే నేడు ఆ ఆటపాటలకు ఫుల్‌స్టాప్ పెట్టి చదువే ధ్యేయమనే తల్లిదండ్రులు ఎంతో మంది వున్నారు. ఇందుకు భిన్నంగా తమ పిల్లలు ఎంచక్కా ఆడుకోవాలంటూ తామే స్వయంగా వారిని ఆయా పార్కులు, ప్లే గ్రౌండ్లకు తీసుకెళ్లే పెద్దలు వున్నారు. గ్రేటర్ విశాఖలోని సముద్ర తీరంలో ఇటువంటి తల్లిదండ్రులను మనం చూడవచ్చు.
ఉదయమంతా పాఠశాల చదువుతో బిజీగా గడిపిన చిన్నారులను వారు సముద్ర తీరంలో వున్న స్కేటింగ్ కోర్ట్‌కు తీసుకెళతారు. అక్కడ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ స్కేటింగ్ చేస్తుంటారు.
స్కేటింగ్ ప్రాక్టీసు పిల్లలకు ఆనందాన్ని కలిగించడంతోపాటు చురుకుగా వుంటారని తల్లిదండ్రులు చెపుతున్నారు. అంతేకాదు ఆటల ద్వారా పిల్లల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి.
|