|
రాష్ట్ర రాజధానిలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులలో భాగంగా పంజాగుట్టలోని ప్రభుత్వ పాఠశాలను అధికారులు కూల్చేయడాని సిద్ధమవుతున్నారన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో భవనాన్ని కూల్చేస్తే పిల్లల భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని అభ్యర్థిస్తున్నారు.
కాగా ఇప్పటికే భవనంలోని నాలుగు గదులను కూల్చేశారు. మిగిలిన భవనాన్ని కూడా త్వరలో కూల్చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తే... ప్రస్తుతం తమ వద్ద అలాంటి సమాచారం ఏదీ లేదన్నారు. ఒకవేళ విస్తరణలో భాగంగా పాఠశాలను పూర్తిగా తొలగించాల్సివస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తామన్నారు.
|