ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > చిన్నారులపై అకృత్యాల విచారణకు కోర్టులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిన్నారులపై అకృత్యాల విచారణకు కోర్టులు
PTI
బాలలపై నేరాలు, అకృత్యాల విచారణకు త్వరలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ విషయమై కేంద్ర న్యాయ, చట్ట విభాగం ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్. గిలానీ మాట్లాడుతూ... ప్రత్యేక కోర్టుల అంశంపై ఇటీవలనే నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు.

జిల్లా లేదా సెషన్సు డివిజనల్ కోర్టుల్లో సీనియర్ న్యాయమూర్తి ఉన్న అదనపు సెషన్సు న్యాయస్థానం ఈ కేసులను విచారిస్తుందని గిలానీ తెలియజేశారు. గుర్తించిన ఆయా కోర్టుల్లో బాలల తరపున కేసులు వాదించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)లను కూడా నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

తామేమీ కొత్తగా కోర్టులు నెలకొల్పడం లేదనీ, చిన్నారులపై రోజు రోజుకీ అకృత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో... ఇలాంటి కేసులను ప్రత్యేకంగా విచారించి, న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకే పై నిర్ణయం తీసుకున్నట్లు గిలానీ మీడియాతో పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఒకేసారి ముద్దు... ఎక్కువగా వద్దు..!
ఇకపై 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య
అతను ఒక్కసారి రాస్తే... ఆరుసార్లు రాసినట్లు లెఖ్ఖ  
"పలుకులు" మొదలెట్టక ముందే పదాలు..!
టీనేజర్లలో "తెలివితేటలు" తగ్గుముఖం..!
మంత్రముగ్ధులను చేస్తున్న బ్రిస్కీ ప్రదర్శన