ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > ఏటా 20 లక్షలమంది చిన్నారుల మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏటా 20 లక్షలమంది చిన్నారుల మృతి
FILE
భారత దేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరుతున్నట్లు అంతర్జాతీయ దాతృత్వ సంస్థ "సేవ్ ది చిల్డ్రన్" వెల్లడించింది. వీరిలో 60 శాతం మంది పిల్లలు కేవలం పుట్టిన 28 రోజులకే మరణిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

మంగళవారం రోజున ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనను విడుదల చేసిన సేవ్ ది చిల్డ్రన్ సంస్థ... కలరా, మలేరియా, నిమోనియా లాంటి వ్యాధులు పసివారి మరణాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రపంచంలోని ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు ఏడాది వయసు లోపలే మృత్యు ఒడికి చేరుకుంటున్నారనీ... అలాగే భారతదేశంలో ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో మరణిస్తున్నారనీ సేవ్ ది చిల్డ్రన్ సంస్థ తన ప్రకటనలో వివరించింది.

కాబట్టి.. ఆయా దేశాల ప్రభుత్వాలు చిన్నారుల మరణాలను ఆపాలంటే... వారి మరణాలకు కారణాలుగా ఉంటున్న వ్యాధుల నివారణకు తగిన కృషి చేయాలని సేవ్ ది చిల్డ్రన్ సూచించింది. అంతేగాకుండా.. భారత్‌లో ప్రధానంగా పోషకాహార లోపంతో మృత్యు ఒడికి చేరుకుంటున్న చిన్నారులను కూడా కాపాడాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేశంలోనే అతిచిన్న అవయవదాతగా అభిలాష
పక్కతడిపే అలవాటును మాన్పించడం ఎలా..?
బార్బీ బొమ్మగా ఐశ్వర్యారాయ్!
భారతీయ చిన్నారులకు గూడీ చేయూత
తల్లిపాలతోబాటు తేలికపాటి ఆహారం ఇవ్వండి
రోజువారీ ప్రణాళికతో పాఠ్యాంశాల పూర్తి