కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » చిచ్చరపిడుగులు టపాసులు కాలుస్తున్నారా..?! (Articles | Diwali | Crackers | Parents | Sanku | Bhu Chakra | Fire | Shirt | Pant | Childrens | Kids | Childs)
Feedback Print Bookmark and Share
 
Diwali
FILE
దీపావళి పండుగ అంటే కొత్తబట్టలు, టపాకాయలే గుర్తుకు రావటం సహజం. పండుగకు ముందునుంచీ పాకెట్లకొద్దీ టపాకాయలు ఖాళీ చేసేసే చిచ్చర పిడుగులు, చిచ్చు బుడ్డీలు ప్రతి ఇళ్లలోనూ ఉంటారు. అయితే ఈ అల్లరి పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకోపోతే ముఖం, కాళ్లు, చేతులు, వేళ్లు కాల్చుకోవటం.. లాంటి ప్రమాదాలకు గురికావచ్చు. కాబట్టి.. టపాకాయలు కాల్చేటప్పుడు చిన్నారులు, పెద్దలు సైతం క్రింది జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించినట్లయితే.. పండుగపూట ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాల్లో మునిగిపోవచ్చు.

టపాకాయలు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివిగో...

* టపాకాయలను పేల్చేటప్పుడు వాటికి కనీసం 25 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. సరిగా పేలని టపాకాయల్ని మళ్లీ మళ్లీ పేల్చేందుకు ప్రయత్నించకూడదు. వీటిని పక్కకి తీసి పారవేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

* ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ టపాకాయల్ని పేల్చేందుకు ప్రయత్నించరాదు. టపాకాయకు నిప్పు అంటించిన వెంటనే దానికి దూరంగా వెళ్లిపోవాలి. టపాకాయను పేల్చేందుకు వీలుగా కొసను తొలగించేటప్పుడు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.

* ఇంట్లో శంకు, భూచక్రాలను కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొన్ని సందర్భాల్లో పేలిపోతుంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. టపాకాయల్ని కాల్చేందుకు పొడవాటి కడ్డీలు (అగర్‌బత్తీలు) ఉపయోగించాలి. కాల్చాల్సిన టపాకాయలను చొక్కా, ఫ్యాంటు జేబుల్లో ఉంచుకోరాదు.

* పెద్దలు, తల్లిదండ్రులు చిన్నపిల్లలు మాత్రమే కాల్చగలిగే టపాకాయలను మాత్రమే కొనివ్వాలి. అలాగే ధర తక్కువగా ఉండే టపాకాయలను కొనివ్వకపోవటం ఉత్తమం. ఇక కొత్తరకాల బాణసంచాను కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను పిల్లలు తూ.చ. తప్పకుండా పాటించేలా పెద్దలు చేయాలి. పిల్లలు టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కనే ఓ బక్కెట్ నిండా నీటిని ఉంచటం మరిచిపోకూడదు.

* చిన్న పిల్లలు చేతుల్లో టపాకాయలను ఉంచి, వాటికి నిప్పంటించి గాల్లోకి విసిరేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ వారు అలాంటివి చేస్తున్నది గమనిస్తే పెద్దలు హెచ్చరించి, అలా చేయకుండా చూడాలి. టపాకాయలను పేల్చే పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఐదేళ్ళలోపు పిల్లల్ని బాణసంచాకు దూరంగా ఉంచటం మరింత మంచిది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.