కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » పిల్లల్లో అతిగురక.. "స్లీప్‌ ఆప్నియా"గా మారే ప్రమాదం..!! (Articles | Snore | Sleep Apnea | Mouth | Wind | Sleep | Oxigen | Child Specialists | Children's | Doctor)
Feedback Print Bookmark and Share
 
Sleep
FILE
చాలామంది చిన్నపిల్లలు నిద్ర పోతున్నప్పుడు గురక పెడుతుంటారు. ఈ గురక ప్రారంభ దశలో అంత ప్రమాదమేమీ కాదుగానీ.. అది కాస్తా అతిగురకగా మారినప్పుడు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదముందని పిల్లల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అతిగురక వ్యాధి "స్లీప్ ఆప్నియా"గా మారకముందే తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.

సాధారణంగా గురకపెట్టేవారు నోటి ద్వారా గాలి పీల్చటంవల్ల గాలి లోనికి వెళ్లినప్పుడు, బయటికి వదిలినప్పుడు మధ్యలో అడ్డంకులు ఏర్పడి నోటిలోని టిష్యూలు అటూ ఇటూ కదులుతుంటాయి. దీనివల్లనే "గురక" శబ్దం వస్తుంటుంది. ఈ శబ్దం తీవ్రత ఉఛ్చ్వాస నిశ్వాసల వేగాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా 3 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఎక్కువగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు గురకపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.

మొదటి దశలో ఉండే ఈ గురక వ్యాధిని "అబ్‌స్ట్రక్ట్రివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ (ఓఎస్ఎఎస్)" అని పిలుస్తుంటారు. దీనివల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగా చేరక పోవటంవల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురవుతారు. రెండోది ప్రతిరోజూ క్రమం తప్పకుండా రావటమేగాక, ఎక్కువగా శబ్దం వస్తుంటుంది. ఈ దశలో గురకపెట్టే పిల్లల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దశలోని పిల్లలు ఖచ్చితంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించి.. చికిత్స అందించకపోయినట్లయితే అది క్రమేపీ ముదిరి తీవ్రమైన "స్లీప్ ఆప్నియా"గా మారే ప్రమాదం పొంచి ఉంటుంది.
ట్రాన్సిల్ కూడా కారణం కావచ్చు
స్లీప్ ఆప్నియా వచ్చేందుకు మరో ముఖ్యకారణం పిల్లల్లో వచ్చే ట్రాన్సిల్స్. ఈ వ్యాధివల్ల గొంతులోంచి గాలి లోనికి పోకుండా అడ్డుకోవటంవల్ల అది స్లీప్ ఆప్నియాగా మారుతుంటుంది. "స్లీప్ ఆప్నియా" వ్యాధికి గురైన పిల్లల్లో.. రాత్రివేళల్లో నిద్రపోయేటప్పుడు విపరీతం...


పిల్లల్లో గురక రావడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే.. స్థూలకాయం, ఎలర్జీలు, ఆస్తమా, గాస్ట్రో ఇంటరోలాజికల్ రిప్లెక్స్ వ్యాధులు, ముఖ భాగాలు సరిగా లేకపోవటం, పిల్లలకు వాడే మందులు.. తదితరాలను పేర్కొనవచ్చు. స్లీప్ ఆప్నియా వచ్చేందుకు మరో ముఖ్యకారణం పిల్లల్లో వచ్చే ట్రాన్సిల్స్. ఈ వ్యాధివల్ల గొంతులోంచి గాలి లోనికి పోకుండా అడ్డుకోవటంవల్ల అది స్లీప్ ఆప్నియాగా మారుతుంటుంది.

"స్లీప్ ఆప్నియా" వ్యాధికి గురైన పిల్లల్లో.. రాత్రివేళల్లో నిద్రపోయేటప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, పగటి వేళల్లో సరిగా నడవలేకపోవటం, ఉదయంపూట తలనొప్పితో బాధపడటం, స్కూలుకు వెళ్లేందుకు ఇష్టం చూపకపోవటం, నోటి ద్వారా గాలి పీల్చుకోవటం, పగటివేళల్లో నిద్రపోవంట తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి.

అలాగే స్కూల్లో సరిగా చదవలేకపోవటం, చెప్పిన పాఠాలను సరిగా గుర్తుంచుకోకపోవటం, ఏకాగ్రత లోపించటం, కార్డియోవాస్కులార్.. లాంటి సమస్యలతో చిన్నారులు బాధపడుతుంటారు. పైన చెప్పుకున్న లక్షణాలతో చిన్నారులు బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స అందించాల్సి ఉంటుంది. కాబట్టి.. తల్లిదండ్రులు తమ పిల్లలు సాధారణ గురకతో బాధపడుతున్నారా లేదా స్లీప్ ఆప్నియాకు గురయ్యారా? అన్న విషయాన్ని గమనించి సత్వర చికిత్సను అందించకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.