ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » పిల్లల పాలిట శాపం "న్యూమోనియా" : డబ్ల్యూహెచ్‌వో (Articles | Pneumonia | World Health Organisation | UNICEF | WHO | Children | Dr Panna Choudhary)
ఊపిరితిత్తుల వ్యాధి అయిన "న్యూమోనియా" పసిపిల్లల పాలిట శాపంగా పరిణమిస్తోందనీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యూనిసెఫ్‌లు విడుదల చేసిన తాజా నివేదికలో వ్యాఖ్యానించాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు నాలుగు లక్షల మంది చిన్నారులను ఈ వ్యాధి కబళిస్తోందనీ.. ఇలా చనిపోతున్న పిల్లలంతా ఐదేళ్లలోపువారే కావటం మరింత విషాదమని ఈ రెండు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతి నిమిషానికి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు 82 మంది న్యూమోనియా వ్యాధి బారిన పడుతున్నారన్నారు. అలాగే ప్రతిగంటకు 45 మంది పసిపిల్లలు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారనీ.. దేశంలో ఇదే అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా తయారైందని ఆయన వాపోయారు.
అవగాహనా లేమితోనే...!
భారత శిశు వైద్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ పన్నా చౌదరి మాట్లాడుతూ.. ఈ వ్యాధిపై దేశంలోని ప్రజల్లో సరైన అవగాహన లేదన్నారు. ప్రభుత్వం ఈ వ్యాధి తీవ్రతను గుర్తించి ప్రజలకు దీనిపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు కృషి చేసినట్లయితే.. లక్షలాదిమంది పిల్లల్ని...
అలాగే.. న్యూమోనియా వ్యాధి విషయంలో ముందస్తుగా రక్షణ చర్యలు తీసుకోకపోవటం, వ్యాధికి గురైన తరువాత సరైన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం కారణంగా కూడా పెద్ద సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్‌వో నివేదిక వెల్లడించింది.
ఇకపోతే.. ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా వ్యాధితో చనిపోతున్న వారందరిలో 25 శాతం మంది భారతీయులే ఉన్నారని పై నివేదిక తెలిపింది. కాగా.. ఇదే విషయమై భారత శిశు వైద్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ పన్నా చౌదరి మాట్లాడుతూ.. ఈ వ్యాధిపై దేశంలోని ప్రజల్లో సరైన అవగాహన లేదన్నారు. ప్రభుత్వం ఈ వ్యాధి తీవ్రతను గుర్తించి ప్రజలకు దీనిపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు కృషి చేసినట్లయితే.. లక్షలాదిమంది పిల్లల్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇక మీదట ప్రతి సంవత్సరం ప్రపంచ న్యూమోనియా దినోత్సవమైన నవంబర్ రెండవ తేదీని ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకుగానూ ముందుకు రావాలని ప్రపంచ స్థాయి సంస్థలన్నీ ఈ సందర్భంగా ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.