కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » ఇంగ్లీషు స్కూళ్లలోనూ "మా తెలుగు తల్లికి" గీతం..! (Articles | Government English Medium Schools | Maa Telugu Talli | Song | Minister | Manikya)
Feedback Print Bookmark and Share
 
Telugu Talli
FILE
ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గీతాన్ని ఆలాపించాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి మాణిక్య వరప్రసాద్ డీఈఓలను ఆదేశించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగిన డీఈఓల సమావేశంలో మంత్రి పై విధంగా ప్రకటించారు.

ఈ సమావేశంలో మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రారంభించిన అన్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలోనూ తప్పకుండా మా తెలుగు తల్లికి గీతాన్ని మరియు జనగణమణ గీతాన్ని ఆలాపించేలా తగు చర్యలు తీసుకోవాలని డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కడపజిల్లా మైదుకూరులో ఇద్దరు పిల్లల మెడల్లో "నేను తెలుగు మాట్లాడను" అనే బోర్డులను తగిలించిన సంఘటన నేపథ్యంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
హర్షణీయమే కానీ...!
శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన నాగేశ్వర రావు మంత్రి ప్రకటన గురించి మాట్లాడుతూ.. మంత్రి ప్రకటన హర్షణీయమే అయినా, తమ పాఠశాలలో తెలుగు విద్యార్థులు కానివారు ఉన్నారనీ, వారికి ఇది సమస్యగా మారవచ్చునని అన్నారు...


కాగా.. మైదుకూరు సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆంధ్ర రాష్ట్ర అధికార భాష అయిన తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందనీ.. దానికి కళంకం తెచ్చే ఇలాంటి పనుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది ఆయన స్పష్టం చేశారు.

మంత్రి ఆదేశాలకు పలు ఇంగ్లీషు మీడియం పాఠశాల వర్గాలు సానుకూలంగా స్పందించాయి. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన నాగేశ్వర రావు మంత్రి ప్రకటన గురించి మాట్లాడుతూ.. మంత్రి ప్రకటన హర్షణీయమే అయినా, తమ పాఠశాలలో తెలుగు విద్యార్థులు కానివారు ఉన్నారనీ, వారికి ఇది సమస్యగా మారవచ్చునని అన్నారు.

అలాగే.. ఆక్స్‌ఫర్డ్ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతా వర్మ మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రకటన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనీ, ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లల్ని తెలుగులో మాట్లాడమని చెప్పటం.. దండనతో సమానమని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. మంత్రి మాణిక్య వరప్రసాద్ ఆదేశాలపై ప్రముఖ రాజకీయ పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి నిరసన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. అంతేగాకుండా, తెలంగాణా ప్రాంతంలోని పాఠశాలల్లో మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలాపించవద్దని ప్రజలకు పిలుపునిచ్చింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.