ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » వాతావరణ మార్పులకు చిన్నారుల బలి : సేవ్ ద చిల్డ్రన్ (Articles | Environment | Kids | Britain | Save the Children | Study | Malaria | Midge Ure | Ambasidor)
వాతావరణ మార్పులకు చిన్నారుల బలి : సేవ్ ద చిల్డ్రన్
FILE
వచ్చే సంవత్సరంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దాదాపు రెండున్నర లక్షలమంది చిన్నారులు మృత్యువాత పడనున్నారని.. బ్రిటన్‌కు చెందిన "సేవ్ ద చిల్డ్రన్" అనే స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. రానున్న రెండు దశాబ్దాల కాలంలో వాతావరణంలో చోటుచేసుకోబోయే మార్పులు.. చిన్నారులపై వాటి ప్రభావం అనే అంశంపై అధ్యయనం జరిపిన ఈ సంస్థ ఓ నివేదికను రూపొందించింది.
2030 నాటికల్లా ప్రతి యేటా 4 లక్షల మంది చిన్నారులు కేవలం వాతావరణ మార్పుల ప్రభావానికి బలవుతారని.. పై నివేదికలో వెల్లడయ్యింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లమంది చిన్నారులు నీటి కొరతవల్ల... మరో 16 కోట్లమంది పిల్లలు మలేరియా వ్యాధి బారిన పడే ప్రమాదం పొంచి ఉందని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సేవ్ ద చిల్డ్రన్ సంస్థకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు, అల్ట్రావాక్స్ ఫేం మిడ్జ్ యురే మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు అంటే, అది ఎప్పుడో 50, 60 సంవత్సరాల తరువాత వచ్చే ప్రమాదం కాదనీ.. తక్షణ ముప్పుగా దాన్ని గుర్తించాలన్నారు. అలా గనుక గుర్తించకపోతే.. భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఏర్పడిన కరవు పరిస్థితుల గురించి వింటూనే ఉన్నామనీ.. ఇప్పుడు అవే పరిస్థితులు ఇథియోపియా చిన్నారులపై ఎలాంటి దుష్ర్పభావాలను చూపిస్తున్నాయో కళ్లారా చూస్తున్నామని రిడ్జ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పులు పిల్లలను ఎంత తీవ్రంగా బాధిస్తాయో తాను స్వయంగా చూశానని రిడ్జ్.. "యురే డైలీ ఎక్స్‌ప్రెస్" అనే పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాబట్టి.. వాతావరణ సమస్యలవల్ల మృత్యువాత పడబోయే చిన్నారులను కాపాడుకోవాలంటే... ముందుగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.