ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » శారీరక వేధింపులకు గురైన బాలల్లో "ఆర్థరైటిస్" (Articles | Kids | Arthritis | Toronto University | Canadian Community Health Survey | Esme Fuller-)
చిన్నతనంలో రకరకాల శారీరక వేధింపులకు గురైన చిన్నారులు ఎదుగే క్రమంలో... ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది. ఇలా బాల్యంలో వేధింపులకు గురైన చిన్నారుల్లో 56 శాతంమంది ఈ వ్యాధికి గురయినట్లు టొరాంటో యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
కాగా... 2005వ సంవత్సరంలో చేపట్టిన కెనడియన్ కమ్యూనిటీ హెల్త్ సర్వే ఆధారంగా.. తాము బాల్యంలో వేధింపులకు గురయ్యామని పేర్కొన్న వారిలో ఎంతమంది ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడ్డారో తెలుసుకునేందుకుగానూ.. పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం వివరాలు "ది జర్నల్ ఆర్థరైటిస్ కేర్ అండ్ రీసెర్చ్" నవంబర్ సంచికలో ప్రచురించారు.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎస్మీ పుల్లర్ థామ్సన్ మాట్లాడుతూ... ఆర్థరైటిస్ వ్యాధికి, బాల్యంలో అనుభవించిన వేధింపులకు సంబంధం ఉన్నట్లుగా తాము నిర్ధారణకు వచ్చామన్నారు. అలా ఆర్థరైటిస్ బారినపడ్డ వారిలో దాదాపు 10.2 శాతంమంది చిన్నతనంలో శారీరక వేధింపులకు గురయినట్లు రుజువైందని ఆయన చెప్పారు. అయితే.. ఈ వ్యాధికి, చిన్నతనంలో ఎదుర్కొన్న వేధింపులకు గల సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు థామ్సన్ వివరించారు.