కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » ప్లాస్టిక్‌ వాడకంతో మగపిల్లల్లో ఆడ లక్షణాలు...!! (Articles | Plastic | Boys | Girls | Scientists | Newyork | Rosestar University | Estrogen | Hormone)
Feedback Print Bookmark and Share
 
Chaild
FILE
ప్లాస్టిక్‌తో మగపిల్లలు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌లోగల రసాయనాలు మగ పిల్లల్లో ఆడ లక్షణాలను కలుగజేస్తాయి కాబట్టి.. ఈ విషయంలో తగిన జాగరూకత వహించి, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండేలా చూడాలని వారు సూచిస్తున్నారు.

ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే మగ పిల్లల్లో సంభవించే మార్పులకు సంబంధించి న్యూయార్క్‌లోని రోషెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి, పై విషయాన్ని నిర్ధారించారు. ప్లాస్టిక్‌లో ఉండే ఫ్తాలేట్స్ అనే రసాయనాలు స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లక్షణాలను కలిగిస్తాయని కనుగొన్నారు. ఫలితంగా ఈ రసాయనం బారినపడ్డ మగ పిల్లల్లో సహజంగా మిగిలిన మగ పిల్లల్లో ఉండే దుడుకుతనం లోపిస్తోందని పరిశోధకులు గుర్తించారు.

ఈ ఫ్తాలేట్స్ రసాయన ప్రభావానికి గురైన మగపిల్లలు... ఇతర మగపిల్లలు సహజంగా ఇష్టపడే కార్లు, తుపాకులు.. తదితర ఆట బొమ్మలపై పెద్దగా ఆసక్తి చూపరని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి మగ పిల్లలు అమ్మాయిలు ఆడుకునే ఆటలపైనే ఎక్కువ మక్కువ చూపుతారన్నారు.

కాబట్టి.. పై పరిశోధనా ఫలితాల ప్రకారం, ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే అబ్బాయిలు.. క్రమంగా అమ్మాయిల లక్షణాలను సంతరించుకుంటారని అర్థమైంది కదూ..! అందుకనే చిన్నారులు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలకు గురవకముందే వారికి ప్లాస్టిక్ బొమ్మలను, వస్తువులను అందుబాటులో ఉంచకుండా చేయటం తల్లిదండ్రుల బాధ్యత.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.