ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » టీవీ అతిగా చూసే చిన్నారుల్లో విపరీత ప్రవర్తన...!! (Articles | Children's | TV | Parents | Counselling Centre | Survey | American | Women | Cartoon Serials |)
మాట వినక పోవటం, చెప్పిన పని అస్సలు చేయక పోవటం, మొండిగా వ్యవహరించటం, చిన్న విషయాలకు సైతం నానా యాగీ చేయటం... లాంటి లక్షణాలు గనుక మీ చిన్నారుల్లో కనిపించినట్లయితే వెంటనే టీవీ కట్టేసి ఏదేని కౌన్సెలింగ్ సెంటర్‌ను సంప్రదించాలని తాజా సర్వే ఒకటి సూచిస్తోంది. అతిగా టీవీ చూసే పిల్లల్లోనే ఇలాంటి విపరీత ప్రవర్తన ఎక్కువగా ఉంటోందని అమెరికాలో జరిగిన ఈ సర్వేలో తేలింది.
అలాగని పిల్లల్ని కౌన్సెలింగ్‌కు పంపించేసి.. పెద్దలు, తల్లిదండ్రులు టీవీలకు అతుక్కుపోయినా కూడా ప్రమాదమేనని ఈ సర్వే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తిండీ తిప్పలు మాని ఎప్పుడూ టీవీలకు అతుక్కుపోయే కుటుంబాల్లో పైన చెప్పుకున్న సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సర్వేలో భాగంగా.. అమెరికాలోని 20 నగరాలకు చెందిన 3,128 మంది మహిళలను ఇంటర్వ్యూ చేసిన అనంతరం పరిశోధకులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ తల్లుల్లో మూడింట రెండు వంతులమంది తమ పిల్లలు రోజుకు రెండు గంటలకుపైగా టీవీ చూస్తున్నట్లు వెల్లడించారు. దీంతో.. సగటున రోజుకు మూడు గంటలపాటు వారు టీవీల ముందు కూర్చున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.
పెద్దల ప్రవర్తనలోనూ మార్పు..
ఈ సమస్యలు పిల్లల్లోనే కాదనీ, పెద్దల ఆలోచనా విధానంలోనే ఉందని పై సర్వేని నిర్వహించిన పరిశోధకులు అంతిమంగా నిర్ధారణకు వచ్చారు. తాము ఎలాంటి కార్యక్రమాలు చూడాలి, పిల్లలకు ఎలాంటి వాటిని చూపించాలనే విషయంలో పెద్దలకు స్పష్టత అవసరమని వారు స్పష్టం చేశారు...
అలాగే.. ప్రత్యేక దినాలలో కనీసం ఐదు గంటలకు పైగా టీవీ కార్యక్రమాలను చూస్తున్నట్లు గమనించారు. టీవీల్లో ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలతోపాటు.. కార్టూన్ సీరియల్స్, హింస, సెక్సు, దౌర్జన్యాలను ప్రేరేపించే కార్యక్రమాలను సైతం చిన్నారులు వీక్షిస్తున్నట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను పిల్లలు ఒకవేళ చూడకపోయినా, తల్లిదండ్రులు చూస్తున్న సమయంలో అవి వారి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.
ఇలాంటి పరిస్థితులే పిల్లల్లో విపరీత ప్రవర్తనకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల పిల్లలకు టీవీలను పూర్తిగా నిషేధించాలని అమెరికా అకాడమీ ఆఫ్ పేటియాట్రిక్స్ సిఫార్సు చేసింది. అంతేగాకుండా.. పెద్ద పిల్లలను రోజుకు రెండు గంటలకంటే ఎక్కువగా టీవీ చూడనివ్వకూడదని గట్టిగా హెచ్చరించింది కూడా...!
అదలా ఉంటే.. ఈ సమస్యలు పిల్లల్లోనే కాదనీ, పెద్దల ఆలోచనా విధానంలోనే ఉందని పై సర్వేని నిర్వహించిన పరిశోధకులు అంతిమంగా నిర్ధారణకు వచ్చారు. తాము ఎలాంటి కార్యక్రమాలు చూడాలి, పిల్లలకు ఎలాంటి వాటిని చూపించాలనే విషయంలో పెద్దలకు స్పష్టత అవసరమని వారు స్పష్టం చేశారు. పిల్లల్ని చదువు, టీవీలకే పరిమితం చేయకుండా ఆటపాటలపై అభిరుచిని పెంచేందుకు కూడా ప్రయత్నించాలని వారు సూచించారు.
ఇలా చేస్తేనే చిన్నారుల వ్యాపకాల్లోనే కాక, ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే టీవీలలో ప్రసారం అయ్యే కార్యక్రమాల ఆధారంగా పిల్లల మానసిక పరిస్థితిని బేరీజు వేసే పరిశోధనలు మరెన్నో ముందు ముందు జరగాల్సి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.