ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » విజ్ఞానం, వినోదాల సమ్మేళనం "ఫన్‌డూ ఫెస్టివల్-2009" (Articles | Children's Festival | Fun do Festival | Lession | Exam | Ramoji Film City | Little Rackers | Rides)
వినోదం, విజ్ఞానం కలబోసిన చిన్నారుల పండుగ "ఫన్ డూ ఫెస్టివల్-2009" వేడుకగా ముగిసింది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న మొదలైన ఈ సందడి చివరిదాకా అంతులేని ఉత్సాహంతో కొనసాగింది. చిన్నారుల కేరింతలు, ఆటపాటలతో.. ఫన్ డూ ఫెస్ట్ చిల్డ్రన్ కార్నివాల్-2009 ఉత్సవాలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన పోటీలలో పాల్గొనటాన్ని మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని పలు విద్యా సంస్థలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ ఫెస్టివల్‌లో నిర్వహించిన అనేక ఆహ్లాద కార్యక్రమాలు బుడి బుడి నడకల బాలలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠాలు, పరీక్షలతో వేడెక్కిన చిన్నారుల బుర్రలను సేదదీర్చుతూ, వారికి మనోల్లాసాన్ని కలిగించాయి.
రాష్ట్రం నలుమూలల నుంచి ఫిలింసిటీకి వచ్చిన విద్యార్థుల కోసం నిర్వహించిన విజ్ఞానాన్ని పెంచే క్విజ్ "కౌన్ బనేగా ఫన్ డూ ఛాంప్", లిటిల్ రాకర్స్ డ్యాన్స్ పోటీలు, ఫన్ డూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, వాయిస్ ఆఫ్ ఫన్ డూ ఫెస్ట్ పాటల పోటీలు, హార్ట్ ఎటాక్ ఫేస్ పెయింటింగ్ కాంపిటీషన్స్.. తదితర కార్యక్రమాలు ఫన్ డూ ఫెస్ట్‌కే హైలెట్‌గా నిలిచాయి.
అలాగే ఆకట్టుకునే రైడ్స్, గేమ్ షోలు, హాస్య ప్రదర్శనలు... తదితర కార్యక్రమాలు విద్యార్థులకు అంతులేని ఆనందాన్నిచ్చాయి. ఇక ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన హాస్య, నృత్య, సంగీత కార్యక్రమాలు విద్యార్థులకు మరపురాని జ్ఞాపకాలను, అనుభూతులను మిగిల్చాయనటంలో అతిశయోక్తి లేదు.