ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > చైల్డ్ కేర్ > 'న్యూట్రిషన్ ప్రోగ్రామ్' ప్రారంభించిన బ్రిటానియా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'న్యూట్రిషన్ ప్రోగ్రామ్' ప్రారంభించిన బ్రిటానియా
దేశంలోని అనేక మంది చిన్నారులు ఐరన్ లోపంతో జన్మిస్తుంటారు. ఖనిజ పోషక పదార్థాలు తక్కువ శాతంలో ఉండటం వల్ల వీరి పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో బిస్కట్లను ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ బ్రిటానియా సంస్థ.. పాఠశాలల్లో న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ఐరన్ శాతం ఎక్కువగా ఉండే టైగర్ గ్లూకోస్ బిస్కట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ కంపెనీ.. తాజాగా పాఠశాలల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

దీనిపై బ్రిటానియా సంస్థకు చెందిన కేటగిరీ డైరక్టర్ అనురాధా నరసింహన్ మాట్లాడుతూ.. దేశంలోని చిన్నారుల్లో 65 శాతం ఐరన్ శాతం తక్కువగా ఉందన్నారు. ఈ లోపం అధికంగా ఉంటే.. విద్యార్థులు తమ చదువులపై దృష్టిని కేంద్రీకరించలేరన్నారు. ఏకాగ్రతను కోల్పోతారన్నారు. ఐరన్ శాతాన్ని పెంచేందుకు గాను ఇప్పటికే.. ఐరన్ శాతం ఎక్కువగా ఉండే టైగర్ బిస్కట్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు చెప్పారు.

తాజాగా, జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థుల్లో న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు ఆమె వివరించారు. కేవలం తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. చిన్నారులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, తమ విధిగా భావిస్తున్నట్టు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సామాజిక స్పృహ కూడా..!
అందరిముందూ వద్దు
అతిగా దండించవద్దు
కిడ్డీ బ్యాంకుల్లో డబ్బు..!
టేబుల్‌పై తినేటప్పుడు
వెనుక భాగం ఎత్తుగా..!