మూడేళ్ళలోపు వయసున్న చిన్నారులకు ఆటలంటే చెప్పలేనంత ఇష్టంగా ఉంటుంది. ఆటల వల్ల చిన్నారుల్లో సంతోషం, ఉత్సాహం కలుగుతాయి. వీరికి ఆనందం కలిగించే విధంగా అనేక రకాల ఆటలు, కలిసి ఆడటం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులతో చక్కటి అనుబంధం కూడా ఏర్పడుతుంది. అలాగే... చిన్న పిల్లలకు పెద్దవారు ఏదైనా విషయాన్ని నేర్పించాలని అనుకుంటే.. దాన్ని వాళ్ళకి కనబడే విధంగా, వాళ్ళు చూసేలాగా చేస్తే... త్వరగా నేర్చుకుంటారు. ఈ వయసులోని పిల్లలు పెద్దవారిని అనుకరించేందుకు, వారి నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కాబట్టి, పిల్లలకు అవసరమైన సహకారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. |