చిన్నారులు ఆకస్మిక ధోరణులను ప్రదర్శిస్తున్నట్లయితే... వాటి వెనుక ఉన్న బలమైన కారణాలేంటో పెద్దవారు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలు దేనిమీదా ఆసక్తి చూపకుండా, గాబరాగా, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నట్లయితే.. వాటికి గల కారణాలను కనుక్కోవాలి.ముఖ్యంగా టీనేజ్‌లోకి అడుగుపెట్టే దశలో ఉన్న పిల్లలు స్వయం విశ్లేషణతో శరీరానికి, ఆకృతికి సంబంధించి ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారేమో పెద్దవారు అంచనా వేయాలి. ఈ విషయాలను వారితోనే మాట్లాడి, మెల్లిగా అర్థం చేయించి, వారి అనుమానాలను, అపోహలను రూపుమాపే ప్రయత్నం చేయాలి.ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉన్న భయాలు, సందేహాలు మాయమై, మునుపటిలా ఉత్సాహంగా ఉండగలుగుతారు. |