పిల్లల దుస్తులనగానే, బజారులో ఫ్యాషన్‌గా ఉండేవి ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి. పిల్లలకు కొంతకాలం వాటిని వాడగానే, వారు పెరుగుతుంటారు కాబట్టి, అవి కురచ అయిపోతాయి. అయితే, బాగున్నాయి కదా అని కురచ దుస్తులను పిల్లలకు బలవంతంగా వేసేందుకు ప్రయత్నించవద్దు.ఆ బట్టలు ఎంత అందంగా ఉన్నప్పటికీ, పాపాయికి అవి సౌకర్యంగా ఉండవు. తేలికపాటి నూలు దుస్తులు, వదులుగా ఉండే బట్టలు మాత్రమే పిల్లల నాజూకు చర్మానికి హాయిగొలుపుతాయి. |