చిన్న పిల్లల్లో పౌష్టికాహార లోపంవల్ల రక్తహీనత ఏర్పడటం ఎక్కువవుతుంది. ఇగి జన్యుదోషం వల్లకూడా థాలసీమియాలాంటి రక్త హీనత వ్యాధులు కలుగుతాయి. ల్యుకోమియాలాంటి బ్లడ్ క్యాన్సరు వల్లకూడా రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనతనే ఎనీమియా అంటారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఉండవలసిన దానికంటే తక్కువగావున్నప్పుడు ఎనీమియాగా పేర్కొంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి-12, పైరిడాక్సిన్ లోపంవున్నప్పుడు ఎర్రకణాలు హిమోగ్లోబిన్ తగినంత తయారుకాదు. ఐరన్ లోపంవల్ల రక్తహీనత ఏర్పడినప్పుడు ఐరన్ ప్రిపరేషన్సు, మందులు, ఐరన్ ఉన్న ఆహారం ఇవ్వాలి. ఇరన్ లోపంవున్నవారికి ముదురాకు పచ్చ ఆకుకూరలు, తోటకూర, బచ్చలికూర, గోంగూర ఆహారంగా ఇవ్వాలి. చిన్న పిల్లల్లో ఐరన్ లోపం ఎనీమియాని మొదట్లోనే గుర్తించి చికిత్స చేస్తే వారి పెరుగుదల సక్రమంగావుంటుంది. వారు శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదుగుతారు. అలాగే చదువులో చురుకుగావుంటారని వైద్యులు తెలిపారు. |