* పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే ఆరేడేళ్లు వచ్చినా గోరుముద్దలు తినిపించటం, స్నానం చేయించటం, బట్టలేయటం, టిఫిన్ బాక్స్ సర్దటం, బూట్లు పాలిష్ చేసివ్వడం లాంటివన్నీ చేసేస్తుంటాం. అయితే ఇలా చేయటంవల్ల పిల్లల్లో పరాధీనత పెరుగుతుంది. చొరవ చచ్చిపోతుంది.* డిగ్రీ పట్టా చేతికి వచ్చినా ప్రపంచ జ్ఞానం అంటే ఏంటో వీరికి తెలియకుండా పోతుంది. ఇంజనీరింగ్ చదివినా పోస్టల్ స్టాంపుకూ, రెవెన్యూ స్టాంపుకు తేడా తెలియకుండా ఉంటారు. డిగ్రీలు ఫాసైనా రైల్వే రిజర్వేషన్ ఫారాలు నింపలేరు, బ్యాంకుల్లో పనులు చక్కబెట్టుకోలేరు. అందుకే పెద్దలు పిల్లల్ని అతి గారాబం చేయటం మంచిది కాదు.* పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతున్నకొద్దీ, వాళ్ల పనులు వారే చేసుకునేలా ప్రోత్సహించాలి. టిఫిన్ బాక్స్ సర్దుకోవటం నేర్పించాలి. పాలిష్ చేయటం ఎలాగో నేర్పించాలి. వారి గదిని సర్దుకునే అలవాటు చేయాలి. చిన్న చిన్న పనుల్ని సైతం పురమాయించాలి. జీవితానికి అవసరమైన ప్రతి పనీ ఒక చదువులాంటిదేనని వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. |