ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > చైల్డ్ కేర్ > "నైతిక విలువల" పాఠాలూ తప్పనిసరే...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"నైతిక విలువల" పాఠాలూ తప్పనిసరే...!!
FILE
* కృషి, పట్టుదల, తెలివితేటలు ఎవరినయినా ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. కానీ అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే మాత్రం అవొక్కటే సరిపోవు. నైతిక విలువలు తప్పనిసరి అవుతాయి. కాబట్టి, పిల్లలకు జీవితంలో అత్యున్నత స్థానాలకు వెళ్లినవారి విజయాలను స్ఫూర్తి కథలుగా వినిపించాలి. పురాణాలలోని మహనీయుల, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల జీవితాలను చందమామ కథల్లాగా చెప్పాలి.

* ధ్యానం, యోగాలను దినచర్యలో భాగం చేయాలి. వీటివల్ల ఆలోచనల మీద నియంత్రణ వస్తుంది. క్రమశిక్షణ అలవడుతుంది. వారాంతాల్లో వెళ్లాల్సిన ప్రదేశాల జాబితాలో వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలూ ఉండాలి. మంచి పుస్తకాలను మించిన నేస్తాలు లేరు కాబట్టి.. పిల్లలకు పుస్తక పఠనం, పత్రికా పఠనం అలవాటు చేయాలి. రోజుకొకసారైనా ఇంటిల్లిపాదీ కలిసి భోంచేయాలి.

* పెద్దల్ని గౌరవించడం, చిన్నవాళ్లని ప్రేమించడం, తోటి పిల్లలతో స్నేహంగా ఉండటం...మొత్తంగా ‘అందరూ మనవాళ్లే’ అన్న భావన పెంపొందించడం కూడా కన్నవారి బాధ్యతే. పిల్లల జీవిత లక్ష్యమేంటో తెలుసుకోవాలి, ఆ దిశగా వాళ్లకి సహకరించాలి. ఆ రంగంలోని స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి వారికి తరచూ చెబుతుండాలి. విలువల విషయంలో ఆచరణే గొప్ప పాఠం. పిల్లలు చెప్పింది వినరు,చేసింది అనుకరిస్తారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పిల్లలు చెవినొప్పితో బాధపడుతున్నారా..?
బొమ్మలతో సంతోషం, ప్రయోజనం కూడా...!!
స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం
చిన్న చిన్న పనులు చేయమని ప్రోత్సహించాలి..!
చిన్నప్పట్నించే "పొదుపు" నేర్పించండిలా..!!
"ట్రాఫిక్ రూల్స్" గురించి మీ పిల్లలకి తెలుసా...?