* స్కూలుకి బయలు దేరాల్సిన సమయానికి రెండు గంటల ముందుగా పిల్లలు తమంతట తాముగా నిద్ర లేవలేకపోతున్నట్లయితే... వాళ్లు రాత్రుళ్లు లేటుగా నిద్రపోతున్నారని అర్థం. దీనివల్ల వాళ్లు సమయానికి తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోలేకపోతారు. ఫలితంగా పోషకాహార లోపం వెంటాడుతుంది. రాత్రుళ్లు పిల్లల్ని ఎక్కువసేపు మేల్కోనివ్వటం వలన వారికి చేటు చేస్తున్నామన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి.* సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రందాకా పిల్లల సమయం అంతా స్కూల్లో గడిచిపోతుంటుంది. ఈ సమయంలో వారికి శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలు అధికంగా అవసరం అవుతాయి. ఇందుకోసం ప్రొటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి.* స్కూల్లో ఇచ్చే టైంటేబుల్స్ పిల్లలకు క్రమశిక్షణను అలవాటు చేసేందుకు నిర్దేశించినవి. వీటివల్ల పిల్లలు ఇంట్లో పనిచేసిన తరువాత ఆడుకోవచ్చు అనే విషయంలో అవగాహన కలుగుతుంది. రోజూ ఒకే సమయానికి హోంవర్క్ చేయించటంవల్ల పిల్లల మైండ్‌సెట్ అందుకు తగ్గట్లుగా మారిపోయి చదువును బాధ్యతలాగా స్వీకరిస్తారు. |