* గతంలో అమ్మాయిలకు చెవులు కుట్టించటాన్ని పెద్ద పండుగలాగా నిర్వహించేవారు. ఇప్పుడలా కాకపోయినా చిన్నారికి చెవులు కుట్టించేందుకు బ్యూటీపార్లర్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామం మంచిదే అయినప్పటికీ... కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.* సాధ్యమైనంతవరకూ గన్‌షాట్ ద్వారా చెవులు కుట్టించటం అన్నింటికన్నా సులువైన మార్గం. నొప్పికూడా తక్కువగా ఉంటుంది. అలాగే, అందుకోసం ఉపయోగించే పరికరాలు బాగా స్టెరిలైజ్ చేసి ఉండాలి. అందుకనే మన సమక్షంలోనే ఆ పరికరాలను ఒకసారి వేడినీటిలో వేసి స్టెరిలైజ్ చేసేలా చూడాలి.* బంగారం ధర ఎక్కువైనా సరే.. చిన్నగా ఉండే బంగారం టాప్స్‌నే కొనడం ఉత్తమం. మొదటిసారే బంగారంవి పెట్టడం వల్ల ఎలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చెవులకు ఏదైనా మందు రాసేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మూడు మాసాలైనా ఆ టాప్స్‌ను మార్చకుండా చూస్తే, నొప్పి సాధ్యమైనంతవరకు తగ్గిపోతుంది. అలాగే, పాపాయి చిన్ని చెవులకు టాప్స్ కూడా అలవాటవుతాయి. |