* పాఠశాలలో రోజువారీ సబ్జెక్టుల గురించి తెలియజేసే టైంటేబుల్ పట్టికను తల్లిదండ్రులు తీసుకుని... దాన్ని పెద్ద ఛార్టుపై రాసి, ఇంట్లో గోడకు అతికించాలి. ఆ ప్రకారం రోజూ పుస్తకాలను సర్దితే, పిల్లల పుస్తకాల సంచీ భారాన్ని కొంత వరకు తగ్గించగలుగుతాం.* అలాగే, వారానికోసారి బ్యాగుల్ని దులపాలి. పేజీలు పూర్తయినవి, మరో రెండుమూడు నెలల తర్వాత అవసరమయ్యే పుస్తకాలను ఇంట్లోనే ఓ అట్టపెట్టెలో సర్దినట్లయితే, పుస్తకాల సంచీ బరువు తగ్గుతుంది. అవవసరమైనప్పుడు వెతుక్కోవాల్సిన అవసరమూ ఉండదు.* బ్యాగుతోపాటు, లంచ్‌బాక్స్ మోతాదు తగ్గించాలి. తేలికపాటి టిఫిన్ బాక్సులు, మంచినీళ్ల సీసాలను ఎంచుకోవాలి. అలాగే చపాతీలు, పూరీల్లాంటివి చేసినప్పుడు... అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఇచ్చినట్లయితే, పిల్లలకు కనీసం కొన్నిరోజులైనా అదనంగా బుట్ట మోసే పని తప్పుతుంది. అలాగే... ఇరుగ్గా ఉండే బూట్ల కారణంగా కాళ్లు పట్టేసినట్లు ఉండి నొప్పెడతాయి కాబట్టి, బూట్లు చాలా సౌకర్యంగా ఉండేలా చూడాలి. |