* అమ్మాయిలు చిన్నవయసు వారైనప్పటికీ మేకప్ సామగ్రిపై ఆసక్తి సహజమే. పైగా వారి వయసుకు తగినట్లు రకరకాల ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే పిల్లలు వాడగలిగే వస్తువులేంటో పరిశీలించి పెద్దలు తగిన జాగ్రత్తలను సూచించాలి.* చిన్నారుల కోసం ప్రత్యేకంగా పండ్ల సుగుణాలతో తయారు చేసిన లిప్‌బామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కొనడం మంచిది. నిత్యం కాకుండా సాధ్యమైనంతవరకు వారాంతాల్లో, ప్రత్యేక సందర్భాలలో వాటిని వాడమని పిల్లలకు చెప్పాలి.* పెళ్ళిళ్లు, పార్టీల్లాంటి ప్రత్యేక సందర్భాలకు వెళ్తున్నప్పుడు గోళ్ల రంగు ఇచ్చి, పిల్లలనే జాగ్రత్తగా వేసుకోమని చెప్పాలి. లిప్‌స్టిక్‌ను వీలైనంతవరకు తగ్గించమని వారికి తెలియజెప్పాలి.* ఎలాంటివి కొన్నా పెద్దలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే... పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి, ఇలాంటి వాటిపై ఆకర్షితులవడం సర్వసాధారణం. కాబట్టి వేసుకోకూడదంటూ ఆజ్ఞలు జారీ చేయకుండా, వారి వయసుకు తగినట్లు చిన్న చిన్న అలంకరణలు చేసుకునేందుకు ప్రోత్సహించటం మంచిది. |