ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > చైల్డ్ కేర్ > నవ్వులాటకు కూడా పిల్లల్ని టీజ్ చేయవద్దు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నవ్వులాటకు కూడా పిల్లల్ని టీజ్ చేయవద్దు
FILE
* ఇంట్లోని పెద్దలు పిల్లలతో వ్యంగ్యంగా మాట్లాడటం మంచిది కాదు. నవ్వుతూ కూడా పిల్లల్ని టీజ్ చేయకపోవడం మంచిది. అప్పుడే టీనేజ్‌లోకి అడుగుపెట్టే పిల్లల్లో హార్మోన్లలోని మార్పుల వల్ల వారు ఎప్పుడు ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారో అర్థం కాదు కాబట్టి జాగ్రత్త పడటం మంచిది.

* అదేపనిగా ప్రశ్నలు వేసి పిల్లల్ని విసిగించకూడదు. ఏదేని విషయం తెలుసుకోవాలని ఉంటే వారిని మాటల్లో పెట్టి లౌక్యంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలేగానీ, అదేపనిగా అడిగితే వారికి కోపం వస్తుంది. కాబట్టి, అడిగీ అడగనట్లుగా పిల్లల్ని అడిగితే అన్ని విషయాలూ చెప్పేస్తారు.

* అదే విధంగా చిన్నారులు ఏదేని విషయం చెబుతున్నప్పుడు ఇంట్లోని పెద్దలు ఎంత పనిలో ఉన్న సరే ఓపికగా వినాలి. మధ్యలో ప్రశ్నలు వేయకుండా, నెమ్మదిగా వింటూ వారిని నమ్మాలి. నువ్వు చెప్పేది నమ్మేదిగా లేదనో, అనవసరంగా సోది చెబుతున్నావనో వారిని చెప్పకుండా ఆపేస్తే చిన్నబుచ్చుకుంటారు. మరెప్పుడూ చెప్పేందుకు ప్రయత్నించరు కాబట్టి జాగ్రత్త.

* అలాగే టీనేజీలోకి అడుగుపెట్టే అమ్మాయిల స్నేహితులను పెద్దలు దూరంగా ఉంచవద్దు. మీ వీలునుబట్టి ఒక్కొక్కరిని అయినా ఇంటికి తీసుకురానివ్వాలి. ఆమె స్నేహితులను ఆదరిస్తున్నారంటే, ఇంటిబయట తన గౌరవాన్ని పెద్దలుగా మీరు కాపాడుతున్నట్లు మీ అమ్మాయికి అర్థమవుతుంది.

* స్నేహితుల ముందు ముద్దుగా మాట్లాడే మీ అమ్మాయి మాటలను, తను తీసే కూనిరాగాల గురించి చులకనగా ప్రస్తావించకూడదు. అలాగే తనపై నిఘా వేసినట్లుగా, కాపలా కాస్తున్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు ప్రవర్తించకూడదు. ముందు మీ చిన్నారులను మీరు నమ్మితే, మిమ్మల్ని మీ నమ్మకాలను వారు నమ్మి, ఆచరిస్తారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పిల్లలకు అతి మేకప్ అనారోగ్యకరం
పుస్తకాల సంచీ బరువుతో వీపునొప్పా...?!
స్కూలు పిల్లలకు శారీరక శ్రమ...!
పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా..?!
పిల్లలు నిద్ర లేవలేకపోతున్నారా...?
చిన్నారుల ఇష్టాలకూ ప్రాముఖ్యత