ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » మీ పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే...?! (Kids world | child care | childs | TV | stories | video games | eyes | study | classical dance)
* పిల్లలు టీవీలకు అతుక్కుపోయేలా చేయవద్దు. పిల్లల సృజనాత్మకతను మింగేస్తున్న ఆ భూతం నుంచి సాధ్యమైనంతమేరకు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. దాని స్థానంలో చిన్నప్పుడు చదువుకున్న, తెలుసుకున్న కథలు వారికి వర్ణించి చెప్పండి. అలా చేయటంవల్ల వాళ్లు రకరకాల దృశ్యాలను ఊహించుకుని వారి మెదళ్లకు పని కల్పిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది.
* వీడియో గేమ్స్‌కు కూడా పిల్లల్ని దూరం చేయడం ఉత్తమం. ఆటలాడించటం వల్ల పిల్లల శరీరానికి లేదా మనసుకు పదును కల్పించాలేగానీ, వీడియోగేమ్స్ పేరుతో వారిని మొద్దుల్లా చేయకూడదు. అవి వారి శరీరాన్ని తెలివితేటలపరంగా కుంగదీయటమేగాక, వారి కళ్లను సైతం దెబ్బతీస్తాయి. అదే ఆటల ద్వారా అయితే పిల్లలు దేహదారుఢ్యంతోపాటు మానసిక పరిపక్వతను కూడా పెంపొందిచుకోగలుగుతారు.
* పెద్దల ఇష్టాలను చిన్నారులపై రుద్దవద్దు. వారు చదువు, నాట్యం, ఆట, పాటలలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నారో గమనించి ఆ రంగంలో కొనసాగేలా పెద్దలు చూడాలి. అదే సమయంలో చదువు ప్రాముఖ్యతను కూడా వారికి తెలియజెప్పాలి. పెద్దల ఉద్దేశ్యాలను పిల్లలపై రుద్దినట్లయితే పిల్లలు ఒత్తిడికి లోనై తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యేందుకు కూడా ఆస్కారం ఉంది కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.