కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » ప్లీజ్.. వీరికీ కాస్త సమయం కేటాయించండి (Kids World | Child Care | School | Study | Teacher | Parents | Body | Friends | Internet)
Feedback Print Bookmark and Share
 
* ప్రతిరోజూ చిన్నారులతో కొద్ది సేపు మాట్లాడాలి. అలా మాట్లాడుతూ.. వారి పాఠశాల గురించి, చదువు, టీచర్ల గురించి ఆరాతీయాలి. పిల్లలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా.. ఇంట్లోని బంధువులు, బయటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారా..? అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడే విధంగా వారిని చిన్నతనం నుంచి తీర్చిదిద్దాలి.

* పసివయస్సు నుంచి వారి శరీరంపై వారికి అవగాహన కల్పించాలి. బంధువులు, ఇతరులు వారిని ఎక్కడ తాకాలి, ఎక్కడ వద్దు అనే విషయాల్ని వారికి నేర్పించాలి. చిన్నారులు ఆడుకోవడానికి బయటికి వెళ్లినప్పుడు వారి మిత్రులు ఎవరు..? వారి ప్రవర్తన ఎలాంటిదనే విషయాల్ని పరిశీలించాలి.

* చిన్నారుల రోజువారీ ప్రవర్తనలో ఏవైనా మార్పులు వస్తున్నాయో గమనిస్తుండాలి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటర్నెట్‌లోని ఇబ్బందికరమైన సైట్లు నిలిపివేసే పరికరాల్ని ఉపయోగించాలి. నేరాలకు పాల్పడే వారికి, కక్షలున్న వారికీ చిన్నారులే సాఫ్ట్‌ టార్గెట్లు కాబట్టి.. పరిసరాల్లో, ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిపై కన్నేయాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.