కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » మీ వరాల మూటల్ని చూసుకోండిలా..!! (Kids World | Child Care | Kids | Beating | Parents | TV | Study | Plays | Food | Junk Food)
Feedback Print Bookmark and Share
 
* పరిసరాల్ని గమనిస్తూ, తెలుసుకోవాలన్న తపన చిన్నారుల్లో కనిపిస్తుంది. దాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లల్లో సహోదర స్పర్థ రాకుండా పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా అడిగితే మొదట ఇవ్వని పెద్దవాళ్లు, కిందపడి ఏడుస్తుంటే చాలా బాధపడిపోయి వెంటనే ఇచ్చేస్తుంటారు. ఈ వైఖరి భవిష్యత్తులో వారిని మొండిగా మారుస్తుంది. కాబట్టి.. వారికి ఎందుకు ఇవ్వటం లేదో ముందే స్పష్టం చేయటం మంచిది

* పక్కనున్న పిల్లలతో పోల్చకూడదు. దీని వల్ల న్యూనత పెరుగుతుంది. పిల్లల్ని కొట్టటం, అల్లరి పనులు చేస్తే మురిపెంగా చూస్తూ ఊరుకోవటం లాంటివి తల్లిదండ్రులు అస్సలు చేయకూడదు. ఈ వైఖరి పిల్లల్లో తప్పుడు సందేశాన్ని పంపుతుంది. కాబట్టి.. తప్పులు చేసినప్పుడు మందలించేందుకు వెనుకాడకూడదు.

* తల్లిదండ్రులు పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. అప్పుడు టీవీ లాంటివి లేకుండా వారికి దగ్గరగా కూర్చొని కబుర్లు చెబుతూ వారితో మమేకమైపోవాలి. పిల్లలు యంత్రాలు కాదన్న విషయం గుర్తించాలి. ఎప్పుడు చదువని వెంటపడకుండా.. ఆటపాటలకు, చదువుకు సమప్రాధాన్యం ఇవ్వాలి.

* పిల్లలకు అందించే ఆహారంలో జాగ్రత్త అవసరం. జంక్‌ఫుడ్‌ని దరి చేరనివ్వకూడదు. ఇలాంటి జంక్‌ఫుడ్ బహుమతుల రూపంలో ఇచ్చినా సరే ప్రోత్సహించకూడదు. ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పెద్దలు గుర్తెరిగి నడుచుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.