కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » పరీక్షలప్పుడు పిల్లలతో ఎలా ఉండాలి..? (Child Care | Children's | Friends | Time Table | Songs | Lemon Juice | Eyes | Potato | Cucumber)
Feedback Print Bookmark and Share
 
* మధ్య మధ్య స్నేహితులతో మాట్లాడి, సరదాగా గడిపేందుకు పిల్లలకి సమయం కేటాయించాలి. ముందుగా పరీక్ష అంటే అదేదో పెద్ద గుదిబండ వచ్చేసి నెత్తి మీద పడిపోబోతోందనే భావనను వారిలోంచి తొలగించాలి. అందుకోసం వారి చదువుకు తోడ్పడే టైమ్‌ టేబుల్‌ తయారుచేయాలి.

* కొన్ని గంటలపాటు చదువుకున్నాక, పావుగంటసేపు పాటలు వింటామంటే పిల్లలను ఆటంకపరచకూడదు. చదువుకుంటూ నీరసిస్తారు కనుక వారికి నిమ్మరసం లాంటివి ఇస్తుండాలి. అప్పుడప్పుడు ముఖం మీద చల్లని నీటిని చిలకరించుకురమ్మని పంపుతుండాలి. కళ్లు అలసిపోతాయి కనుక, కళ్ల మీద బంగాళదుంపలు, కీరాల చక్రాలను చల్లబరచి కళ్ల మీద పెట్టాలి. వాటి వల్ల తాజాదనం కలుగుతుంది.

* పరీక్షల సమయంలో పిల్లలకు సంపూర్ణంగా నిద్ర వుండాలి కనుక, రాత్రి త్వరగా అన్నం తినిపించి నిద్ర పుచ్చాలి. పిల్లలు చదువు మధ్యలో కనుక డిప్రెషన్‌కు గురైతే, కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు వీలుగా నంబర్లను పెద్దలు అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లల క్లాస్‌ టీచర్లు, కొందరు మిత్రుల ఫోన్‌ నంబర్‌లను కూడా దగ్గరుంచుకోవటం ముఖ్యం.

* పిల్లల దగ్గర పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలూ వున్నాయో లేదో, ఓసారి జాగ్రత్తగా పరిశీలించాలి. వాటితో పాటు నోట్స్‌ కూడా చూడాలి. వారి నోట్సులలో కావలసిన విషయాలు అసంపూర్ణంగా వుంటే, పరీక్షలకు ముందుగానే వారి క్లాస్‌మేట్స్‌ నుంచి తీసుకుని పూర్తి చేయించాలి. వాతావరణమంతా సంపూర్ణంగా శక్తినిచ్చేదిగా వుండాలి. ఆహారపానీయాల పట్ల కూడా తగినంత శ్రద్ధ తీసుకుంటే, పిల్లలకు చదువుకునేందుకు ఉల్లాసం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.