కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » టీనేజ్ పిల్లల ప్రవర్తన.. పెద్దల తీరు..! (Child Care | Kids | Childish | Adolescents | Parents | Friends | Depression | Psychiatrist)
Feedback Print Bookmark and Share
 
* బాల్యదశ దాటి యవ్వనంలోకి అడుగుపెట్టే పిల్లల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. దీనినే అడల్‌సెన్స్ దశ అంటారు. ఈ దశలో జరిగే మార్పులను పిల్లలు, వారి తల్లిదండ్రులు అంత త్వరగా జీర్ణించుకోలేరు. ఈ వయస్సులో శారీరకంగా సంభవించే హార్మోన్‌ మార్పుల వలన పిల్లలు మూడీగా ఉంటుంటారు.

* టీనేజ్‌లోకి అడుగుపెట్టిన చిన్నారులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ఫ్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. స్వతంత్ర భావనలు, ఆలోచనలు కలుగటంతో ప్రత్యేక గుర్తింపుకోసం తపిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆదేశాలను పట్టించుకోరు. దీంతో పిల్లలు మాట వినటం లేదని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుంటారు.

* ఇలాంటి సమయంలో పిల్లల గురించి ఆందోళన చెందకుండా వారికి సరైన మార్గదర్శకత్వం వహించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. టీనేజ్‌ పిల్లలు శారీరకంగా, మానసికంగా తమలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకోలేక తీవ్రమైన అలజడికి లోనవుతుంటారు. డిప్రెషన్‌కు గురవటమేగాక భావోద్వేగాలను ఏ మాత్రం ఓర్చుకోలేనివారుగా తయారవుతారు.

* ప్రత్యుత్పత్తి అవయవాలలో గుణాత్మకమైన మార్పుల కారణంగా టీనేజర్స్‌లో సెక్స్‌ సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ దశలో తల్లిదండ్రులు వారి సమస్యలను ఓపికగా విని, అర్థం చేసుకుని వాటికి పరిష్కారాన్ని సూచించాలేగానీ.. మాట వినటం లేదని కఠినంగా వ్యవహరించకూడదు. ఈ దశలో పిల్లలకు కొన్ని విధానాలను అలవాటు చేస్తూ.. వారికి మార్గదర్శకత్వం వహించాలి. వారి తప్పులను గుర్తించి సున్నితంగా హెచ్చరించాలి.

* టీనేజర్స్‌ సమస్యలను తల్లిదండ్రులే చాలా వరకూ పరిష్కరించవచ్చు. మత్తు మందులకు బానిసలుగా మారినప్పుడు లేదా డిప్రెషన్‌కు గురైనప్పుడు మాత్రమే వారిని సైకియాట్రిస్ట్‌కు చూపించి.. తగిన చికిత్స చేయించాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.