కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » పిల్లలు అదేపనిగా ఏడుస్తూనే ఉన్నారా..? (Child Care | Children | Cry | Stomach | Ear | Cold | Over Feeding | Milk | Doctor)
Feedback Print Bookmark and Share
 
Mother_Kid
FILE
ఒకటి నుంచి ఆరు నెలల లోపు చిన్నపిల్లలు అదేపనిగా ఏడుస్తూ ఉన్నట్లయితే.. ముఖ్యంగా వారు కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు లాంటి కారణాలతో ఏడుస్తుండవచ్చు. సాధారణంగా మూడు నెలల లోపు పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి కావచ్చు.

కడుపునొప్పితో బాధపడే పిల్లల్లో వచ్చే ఏడుపుకు నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయినప్పటికీ.. ఆకలి, గాలి ఎక్కువగా మింగటం, ఓవర్ ఫీడింగ్, పాలల్లో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం తదితరాలను చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు పిల్లల్ని ఎత్తుకోవటం, వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాఫర్ పీడింగ్ టెక్నిక్‌లతో వారి ఏడుపును మాన్పవచ్చు.

అలాగే.. పిల్లలకు యాంటీ స్పాస్మోడిక్‌తోపాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తున్నట్లయితే వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవటం మంచిది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.