కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » అతిగారాబం చేయటం వల్లనే పెంకితనం.. (Child Care | Children | Parents | Age | Love | Mental Scientist)
Feedback Print Bookmark and Share
 
Girl
FILE
* తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేసే అతిగారాబం వల్లనే పిల్లల్లో మొండితనం పెరుగుతుంది. కాబట్టి వారిని అతిగారాబం చేయకూడదు. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి ప్రేమని ఆశిస్తారు. అలాంటప్పుడు వారిని పట్టించుకోకుండా ఉంటే, విరక్తి భావం ఏర్పడి.. మొండితనానికి దారితీస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* పిల్లల వయసు పెరుగుతున్నకొద్దీ.. వారి మనస్తత్వంలో, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. తల్లిదండ్రులు వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. అంతేగానీ వారిని అతిగా దండించకూడదు. వారు చెప్పే ప్రతివిషయాన్ని వ్యతిరేకించి కించపరిస్తే కూడా పిల్లల్లో మొండితనం పెరుగుతుంది.

* పిల్లల అభిరుచులను గుర్తించకుండా పెద్దల ఇష్టాలను వారిపై రుద్దకూడదు. పిల్లలు నచ్చని పనులు చేస్తున్నప్పుడు వీలైనంత వరకూ ప్రేమతో నచ్చచెప్పాలి. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి వారిని దండిస్తే వారిలో మొండితనం పెరిగిపోతుంది. పెద్దల ప్రతి నిర్ణయానికీ పిల్లలు కట్టుబడాలని అనుకుంటే వారిని మరింత మొండిగా తయారు చేసినట్లవుతుంది కాబట్టి నిర్ణయాల్లో పట్టువిడుపులు ఉండాలి.

* మాట వినకుండా తయారవుతారేమోనని ముందే ఊహించుకుని పిల్లలపట్ల అతిజాగ్రత్త వహించినా పిల్లలు మొండిగా తయారవుతారు. అందుకనే.. చిన్నతనంలోనే పిల్లలకు ప్రేమతో నచ్చచెప్పి వారిలోని మొండితనాన్ని తగ్గిస్తే.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అవుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.