కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » మీ జూనియర్స్ విషయంలో ఇవి పాటించి చూడండి..! (Child Care | Children | Fear | Parents | Boy | Girl | Treat | Grand Mother | Grandfather | Health)
Feedback Print Bookmark and Share
 
Kids
FILE
* పిల్లలు మీ ముందు భయపడాలన్న భావనను వదిలేయండి. మీ ఆధిపత్యాన్ని వారిపై చూపించాలన్న ఆలోచనకు గుడ్‌బై చెప్పేయండి. అమ్మాయిని ఒక రకంగా, అబ్బాయిని మరో రకంగా ట్రీట్ చేయటం మానుకోండి. అపరిచితుల ముందు వారిని కొట్టటం, తిట్టటం లాంటివి చేయకూడదు. మిగతా పిల్లలతో మీ పిల్లల్నిపోలుస్తూ.. హేళన చేయటం తగదు.

* తెలిసో, తెలియకో పిల్లలు చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖండించవద్దు. "నీకేం తెలీదు ఫో" అంటూ విసుక్కోవద్దు. పిల్లలు అడిగిందల్లా కొనివ్వటం, అతిగారాబం చేయటం మానుకోవాలి. అలాగే అతిగారాబం చేసే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల వద్దకు ఎక్కువగా చేరనీయవద్దు.

* అది తినొద్దు, ఇది తినొద్దు, అది పడదు.. అంటూ ప్రతిదానికీ పిల్లల్ని దూరంగా ఉంచవద్దు. అలాచేస్తే అదే వారి ఆరోగ్యానికి శాపంగా పరిణమించవచ్చు. పిల్లల్ని నియంత్రించి అదుపులో పెట్టాలని చూస్తే.. వారు అబద్ధాలు, దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అశ్లీల పదాలు, బూతు మాటలు మాట్లాడవద్దు, పిల్లలు వాటిని నేర్చుకోకుండా చూడాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.