* కండక్ట్ డిజార్డర్ ముఖ్యంగా ఆరు నుంచి 13 సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఇది అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లో ఎక్కువగా ఉంటుంది. అసాధారణ ప్రవర్తన, మద్యం.. లాంటి వ్యసనాలున్న తల్లిదండ్రుల పిల్లలకు ఈ మానసిక రుగ్మత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో అసాధారణమైన కోపం, పోట్లాట, అతి మొండి, ఇంట్లో వస్తువులను ధ్వంసం చేయటం, అబద్ధం, దొంగతనం.. తదితర లక్షణాలుంటాయి.
* కండక్ట్ డిజార్డర్ వ్యాధికి గురైన పిల్లలు జీవితం అంతా వ్యక్తిత్వ రుగ్మతతో భాదపడుతుంటారు. కాబట్టి.. తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల అసాధారణ ప్రవర్తనను గుర్తు చేస్తూ నిందించటం తగదు. ఇలాంటి పిల్లల్లో చెడుతోపాటు మంచి లక్షణాలు కూడా ఉంటాయి. వాటిని గుర్తించి, వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. ప్రేమతో ప్రవర్తించి వారి మనసులను గెలవాలి.
* ఈ వ్యాధితో బాధపడే పిల్లల్ని ఇతరులతో పోల్చి చూపటం, తొందరగా కోపం వచ్చేటట్లు చేయటం లాంటివి తల్లిదండ్రులు చేయకూడదు. ఇలాంటివారు మంచి ప్రవర్తన అలవర్చుకునేలా పరిస్థితుల్ని సృష్టించాలి. ఇలాంటి జాగ్రత్తలతోపాటు "బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్" తదితర చికిత్సలను కూడా అందిచాలి. అవసరమైతే సైడ్ ఎఫెక్ట్ లేని మందులను వాడినా కూడా పిల్లల్ని ఈ సమస్య నుంచి బయటపడేయవచ్చు.