కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » అతిచురుకు పిల్లలతో వేగటం ఎలా..? (Child Care | Kids | Kids | Overactive | Discipline | Parents | Sports | Study | Trees | Vegetables)
Feedback Print Bookmark and Share
 
Over Active Kid
FILE
* అతిచురుకుదనం కొందరికి జన్మతః వస్తుంది. ఎదిగేకొద్దీ వారిలో ఆ తేడా కనిపిస్తుంది. ఇలాంటి పిల్లలు కుదురుగా ఉండరు. ఆటల్లో, స్నేహితులతో దూకుడుగా వ్యవహస్తారు. తల్లిదండ్రులు రోజువారీ పనుల్లో మునిగిపోయి తమను పట్టించుకోలేదని ఫీలయ్యేవీరు.. ఎవరో ఒకరు తమను చూసుకోవాలనే పట్టుదలతో అతిచురుకుగా మారిపోతుంటారు.

* అతిచురుకు పిల్లలకు క్రమశిక్షణ తప్పనిసరి. అయితే దండించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వారిస్తే సరిపోతుంది. ఈ విషయంలో పేరంట్స్ ఇద్దరూ ఒకేమాటపై ఉండాలి. అలాగే వీరు పిల్లల కోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలి. కబుర్లు, సలహాలు, సూచనలు.. లాంటివి పిల్లల మానసిక వికాసానికి దోహదం చేస్తాయి.

* పిల్లలు చురుగ్గా, దూకుడుగా ఉంటూ అస్సలు అలసిపోకుండా ఉంటే.. ఒక్కసారి వారి దైనందిన కార్యక్రమాలను సమీక్షించాలి. వారి శక్తిని చదువు, ఆటపాటలమీదికి కేంద్రీకరించేలా ప్రణాళిక రూపొందించాలి. కుదురులేని పిల్లల్ని పట్టుదలగా ఇంట్లో కూర్చోబెట్టాలని అనుకోవద్దు. పిల్లలకి ఆసక్తి ఉండే క్రీడల్లో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేయాలి.

* అతిచురుకుగా ఉండే పిల్లలు ఏది చెప్పినా ఇట్టే గ్రహించేస్తారు కాబట్టి.. వారికి చదువు మాత్రమే కాకుండా, ఏదైనా సులువుగా నేర్పించవచ్చు. చిన్న చిన్న పనులు చేయమని చెప్పాలి, వంటపనుల్లో సాయం తీసుకోవాలి. మొక్కలకు నీళ్లు పోయటం, కూరగాయలు సర్దమనటం లాంటి పనులన్నీ కూడా పిల్లలు కుదురుగా ఉండేలా చేస్తాయి. ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వారిలో మార్పు రాకపోతే పిల్లల నిపుణులను సంప్రదిస్తే సరిపోతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.