* చిన్నారుల ఎంపిక (ఛాయిస్)ను పరిమితం చేయటం పాజిటివ్ డిసిప్లిన్‌లో అత్యంత ప్రధానమైనది. పిల్లలకి ఏ అంశంలో అయినా రెండు లేదా అంతకు మించిన అవకాశాలను చెప్పి.. వాటిలో ఒకదాన్ని ఎంచుకోమని సలహా ఇవ్వలేకానీ, పూర్తి ఎంపిక వారికి ఇవ్వకూడదు. ఇలా వారి నిర్ణయాత్మక అవకాశాల్ని పరిమితం చేయటంవల్ల పిల్లలపై పెద్దల నియంత్రణా ఉంటుంది, అలాగే వారి అభిప్రాయానికి విలువ ఇచ్చినట్లు అవుతుంది.
* మంచినీళ్లు తాగుతావా లేదా జ్యూస్ తాగుతావా..? లాంటి ప్రశ్నలు వేయటంవల్ల.. వారి అభిప్రాయాన్ని గౌరవించామన్న భావం పిల్లలకు దక్కుతుంది. అంతేగానీ.. నువ్వు ఏం తాగుతావు, ఏ బట్టలు వేసుకుంటావు..? లాంటి ప్రశ్నలతో పూర్తి అవకాశాన్ని వారికి ఇచ్చేయకూడదు. అలాగే ఇది చెయ్యి, ఇది తాగు అంటూ ఆర్డర్ వేసే బదులు.. పై రెండు ప్రత్యామ్నాయాల్ని వారి ముందు ఉంచటంవల్ల వాదాలు, పేచీలు లేకుండా లొంగిపోతారు.
* ఇంట్లో ప్రేమపూరిత, గౌరవప్రద వాతావరణాన్ని కల్పించాలంటే వారాంతపు సెలవుల్లో కుటుంబ సభ్యులందరూ కలసి సమావేశమవుతుండాలి. దీని వల్ల స్వయం క్రమశిక్షణ, సహకారం, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, సహాయపడే ధోరణి అలవడతాయి. పరస్పర సహకారం, పరస్పర గౌరవాలతో సమస్యల్ని పరిష్కరించుకోగల తత్త్వం పిల్లలకు చిన్నతనం నుంచి అలవడుతుంది. పిల్లలకు చక్కని భద్రతాభావం ఏర్పడుతుంది.