కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » చిన్నారుల వ్యక్తిత్వ వికాసంలో పెద్దల పాత్ర (Child Care | Children | Kids | Parents | Mother | Father | Health)
Feedback Print Bookmark and Share
 
Father
FILE
* పిల్లల అవసరాలను, ఇబ్బందులను గుర్తించి తీర్చగలిగిన తల్లిదండ్రులు.. వారి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి గట్టి పునాదిని వేస్తున్నట్లుగా భావించవచ్చు. పిల్లలకు భౌతికపరమైన సౌకర్యాలను మాత్రమే గుర్తిస్తే సరిపోదు. వారి మానసిక, భావోద్వేగ, నీతి నియమ, సామాజిక, మేధోపరమైన అంశాలకు సంబంధించిన అవసరాలన్నింటిని కూడా గమనించి, వాటిని తీర్చాలి.

* చిన్నపిల్లల వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవించటం పెద్దల బాధ్యత. పిల్లల ఇష్టాలు, అయిష్టాలను బలవంతంగా మార్చే ప్రయత్నం చేస్తే వారిలో మొండితనం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏవైనా తప్పులు చేస్తే, వారిని దండనకు గురిచేయటం సరైనది కాదు. ఆ తప్పును పరోక్షంగా ఎత్తిచూపి, మరోసారి అదే తప్పును చేసేందుకు పిల్లలు సిగ్గుపడేలా చేసినప్పుడే పిల్లల ఎదుగుదల బాగుంటుంది.

* నత్తి లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. వాటిని గమనించి పెద్దలు సరిదిద్దగలగాలి. అంతేగానీ ఆ లోపం ఉన్నందుకు తల్లిదండ్రులు సిగ్గుపడుతుంటే, అందులోంచి పిల్లలు ఎప్పటికీ బయటపడలేరు. కాబట్టి.. పిల్లల లోపాలను తక్కువచేసి, వారిలోని శక్తియుక్తులకు మెరుగులు దిద్దటం ఎంతయినా అవసరం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.