కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » చిన్నారులు అన్ని రంగాల్లోనూ ఎదిగేది.. ఎలా..? (Child Care | Kids | Ranks | Marks | Moody | Parents | Friends | Sports | Tours)
Feedback Print Bookmark and Share
 
Boy
FILE
* సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పిల్లలను పెంచాలి. అన్ని రంగాల్లోనూ ఎదిగేలా వారి పెంపకం సాగాలి. కేవలం ర్యాంకులు, మార్కులు లక్ష్యంగా పెంచితే పిల్లలు మూడీగా తయారవుతారు. లోకం పోకడ తెలియక, పదిమందిలోకి వెళ్లి ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడతారు.

* తల్లిదండ్రుల నుంచే పిల్లలు అనేక అంశాలను నేర్చుకుంటారు. ప్రతి విషయంలోనూ నిశితంగా గమనిస్తారు. కాబట్టి, తల్లిదండ్రులు రోల్‌మోడల్‌గా నిలవాలి. పేరెంట్స్ కీచులాడుకుంటూ పిల్లల్ని స్నేహితులతో పోట్లాడకూదని చెప్పలేరు కాబట్టి.. గొడవల్లేకుండా ఉండాలి. మంచి అలవాట్లను పెద్దల నుంచే పిల్లలు అలవరచుకుంటారు కాబట్టి అందుకు తగినట్లు పెద్దలు నడచుకోవాలి.

* కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కువ సమయం గడిపేలా చూడాలి. ఆటలు, విహార యాత్రలు కలసి చేయాలి. భోజనాల వద్ద ఒకేసారి కూర్చుని ఒకేసారి లేవాలి. ఇంట్లో పనులను, ఇతర బాధ్యతలను పిల్లలతో పంచుకోవటం మంచిది. పిల్లలకు మంచి, చెడులను విడదీసి చూపి.. మంచి వల్ల లాభాలు, చెడువల్ల నష్టాలను తెలియజెప్పి. మంచివైపు అడుగులు వేసేలా తయారు చేయాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.