ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > పక్షుల్లాగా... బాతులు ఎగురుతాయా..?!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పక్షుల్లాగా... బాతులు ఎగురుతాయా..?!
FileFILE
పిల్లలూ...! పక్షులు గాలిలో ఎగురుతాయని అందరికీ తెలిసిన విషయమే.... మరి బాతులు కూడా గాల్లో ఎగురుతాయా...?! అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం...!

బాతులు జలచరాలు. జలచరాలంటే... నీటిలోనే జీవించే జాతికి చెందిన జీవులన్నమాట. ఈ బాతులు నీటిలో నడువగలవు, ఈతకొట్టగలవు కానీ.... ఎగురలేవు. అయితే అన్ని జాతులకు చెందిన బాతులూ ఎగరలేవని అనుకోవడానికి లేదు.

కొన్ని ప్రదేశాలకు చెందిన వలసజాతి బాతులు గాల్లోకి కూడా ఎగురగలవు. అంటే... ఉత్తరాది ప్రాంతాల్లోని బాతులు పైకి ఎగురుతాయి. శీతాకాలంలో అవి చలిని భరించలేక సమోష్ణ ప్రదేశాలను వెతుక్కుంటూ, గాల్లో ఎగురుకుంటూ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళతాయి.

ఇకపోతే... హంసలు... అటు నీటిలో ఈదగలవు, ఇటు ఆకాశంలోనూ ఎగురగలవు. దీవుల్లో జీవించే బాతులు మాత్రం ఏ మాత్రం ఎగురలేవు. వాటి కాళ్లు ఈదేందుకు మాత్రమే తగినట్లుగా ఉంటాయి కానీ, ఎగిరేందుకు కాదు...!
మరిన్ని
ఇవి మీకు తెలుసా..!?
మన శాస్త్రవేత్త... శాంతి స్వరూప్ భట్నాగర్
చేపలు గాలి పీల్చుకుంటాయా...?
పక్షులు గాలిలో ఎలా ఎగుర గలవు?
ఇవి మీకు తెలుసా..?!
లేజర్ పెన్ను గురించి తెలుసా...?