పిల్లలూ...! అమెరికా అంటేనే మొదటగా మనకు గుర్తొచ్చేది ఏంటో మీకందరికీ తెలిసే ఉంటుంది. అదే "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" విగ్రహం. పైకి ఎత్తి ఉంచిన కుడిచేతిలో ప్రకాశవంతంగా వెలుగుతున్న కాపర్ టార్చ్ (దివిటీ) ఉంటే... ఎడమచేతి పిడికిలో ఏదో గట్టిగా పట్టుకుని ఉంటుంది.
ఇంతకీ విగ్రహం ఎడమచేతి పిడికిలిలో ఏముంటుందో మీకు తెలుసా...?! ఆ మూసి ఉంచిన గుప్పిట్లో జూలై 4, 1776 అనే అంకెలు ఉన్న ఒక ఫలకం ఉంటుంది. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినట్లుగానే... అమెరికాకు కూడా జూలై 4, 1776 సంవత్సరంలో వచ్చింది. ఇక, "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" అంటే... "లిబర్టీ ఎన్‌లిటింగ్ ది వరల్డ్" అని అర్థమన్నమాట...!
|