ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > బంగాళాదుంప కథా... కమామీషు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బంగాళాదుంప కథా... కమామీషు!
FileFILE
పిల్లలూ..! సినిమాకెళ్ళినా, బీచ్‌కెళ్ళినా చిప్స్ ప్యాకెట్స్ కొనుకుని కరకరా నమిలేస్తుంటారు కదా...! ఆ చిప్స్‌ను వేటి నుంచి చేస్తారో తెలుసా...? బంగాళాదుంపల నుండి వాటిని తయారు చేస్తారు. అసలు ఈ బంగాళాదుంప కథా... కమామీషు ఏంటో తెలుసుకుందామా..?!

ఉర్లగడ్డ, ఆలుగడ్డ, బంగాళాదుంప అనే పేర్లతో పిలిచే ఈ దుంప అసలు మన దేశానికి చెందినదే కాదు. ఇది దక్షిణ అమెరికాలోని ఉత్తర ఆండీస్ పర్వతాల నుండి మనదేశానికి తరలి వచ్చింది. మొదట ఇన్‌కా జాతివారు ఈ దుంప వేరును కాపాడి ప్రత్యేకమైన పంటగా పెంచారు.

ఆ తరువాత 15వ శదాబ్దంలో యూరప్‌కి, 16వ శతాబ్దంలో మిగతా దేశాలకు ఈ బంగాళాదుంప తరలివచ్చింది. ఈ దుంపల పిండిని బట్టల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటినుండి గ్లూకోజ్, చక్కెర, పవర్ ఆల్కహాల్ కూడా తీస్తారు.

బంగాళాదుంపలలో అనేక రకాలున్నాయి. వీటి కోసం మనదేశంలో సిమ్లాలో పొటాటో ఇన్‌స్టిట్యూట్ కూడా ఏర్పడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు రకాల హైబ్రీడ్ వంగడాలను కూడా రూపొందించారు.
మరిన్ని
చెట్లనీడ చల్లగా ఉంటుంది. ఎందుకు?
ఇవి మీకు తెలుసా...?!
"స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" గురించి తెలుసా...?
సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకు?
బాక్టీరియాను కనుగొన్నది ఎవరు?
కోటి తిప్పలు కూటి కోసమే...!