పిల్లలూ..! ఈ భూ ప్రపంచంమీద ఉన్న అనేక రకాల జంతుజాలంలో ఒక విచిత్రమైన జంతువు ఏదని అడిగితే... వెంటన్ "వాల్‌రస్" అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చేప, కుక్కను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి. ఈ వాల్‌రస్‌లలో కూడా నాలుగు రకాలున్నాయి.
ఈ వాల్‌రస్ జంతువులు ఆడా, మగా రెండింటికీ ఎనుగుదంతం లాంటి పొడవైన దంతాలుంటాయి. అయితే ఇవి మనుషులకు ఎలాంటి అపాయం తలపెట్టని జంతువులు. అలస్కాలో నివసించే ఎస్కిమో జాతి వారికి వీటి మాంసం, శరీరం చాలా అవసరం. కాబట్టి వీటిని వారు వేటాడుతుంటారు.
ఉత్తర బేరింగ్ సముద్రంలో, సెయింట్ లారెన్స్ దీవుల్లోని మంచుదిబ్బలమీద ఈ వాల్‌రస్‌లు ఎక్కువగా నివసిస్తుంటాయి. మంచుమీద ఉండేలాగా, నీటిలో ఈదేలాగా వీటి శరీరం అనువుగా ఉంటుంది. అంతేగాకుండా ఇవి అతిశీతల పరిస్థితులను కూడా తట్టుకోగలవు. చూసేందుకు భయంకరంగా ఉన్నప్పటికీ ఇవి చాలా సాధుజంతువులు.
|