ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > ఏనుగులకు లెక్కలొచ్చట...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏనుగులకు లెక్కలొచ్చట...!
FileFILE
పిల్లలూ...! ఏనుగులంటే మీ అందరికీ ఇష్టమే కదూ...! అంత పెద్ద పెద్ద ఆకారాలతో ఉండే ఏనుగులపై ఎక్కి సవారి చేయాలని అందరికీ అనిపిస్తుంది. గుళ్లలో కనిపించే ఏనుగులకు అరటిపండు ఇచ్చి దాని తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలంటే మీకు మరింత ఇష్టం కదూ....! మరి ఈ ఏనుగులకు కూడా లెక్కలు తెలుసంట. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం...!

సాధారణంగా మనం సర్కస్‌లో చూసే ఏనుగులు ఫుట్‌బాల్ ఆడటం, క్రికెట్ బ్యాట్‌తో బంతిని తన్నటం లాంటి విన్యాసాలను చేస్తాయి. అయితే ఆసియా జాతి ఏనుగులకు కూడికలు కూడా తెలుసని జపాన్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు నిరూపించారు.

అదెలాగంటే... మొదటగా ఒక బకెట్లో మూడు, మరో బకెట్‌లో ఐదు యాపిల్స్‌ను వేసి... ఆ తర్వాత వాటికి మరో రెండు చొప్పున యాపిల్స్‌ను పరిశోధకులు జతకలిపారు. అంటే మొత్తం మీదా ఒక బకెట్లో ఐదు, మరో బకెట్లో ఏడు యాపిల్స్‌ను వేసి ఎంపిక చేసుకున్న ఒక ఏనుగు ముందు పెడితే... అది ఆ బకెట్లో ఏముందో చూడకుండానే ఎక్కువ పండ్లున్న బకెట్‌నే ఎంచుకుందట.

ఆరుసార్లు ఇలా మార్చి మార్చి చేసినప్పటికీ అది ఎక్కువ పండ్లున్న బకెట్‌నే ఎంచుకుంది. పదిలోపు అంకెలతో కూడిన కూడికలను 87శాతం మేరకు ఆ ఏనుగు ఖచ్చితంగా ఎంపిక చేసుకుందట. కాబట్టి... ఏనుగులకు కూడా కూడికలు బాగా తెలుసని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
మరిన్ని
ఉరితాడునే పూమాలగా ధరించిన భగత్‌సింగ్..!
మీకివి తెలుసా...?!
పిరమిడ్ల (మమ్మీలు) కథ..!
మీకివి తెలుసా...?!
ప్రకృతిలో విచిత్ర జంతువు "వాల్‌రస్"
బంగాళాదుంప కథా... కమామీషు!