ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > అపోఫిస్ భూమిని ఢీకొడుతుందా...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అపోఫిస్ భూమిని ఢీకొడుతుందా...?
WD PhotoWD
పిల్లలూ..! సూర్యుడి చుట్టూ అనేకమైన గ్రహ శకలాలు (ఆస్టరాయిడ్స్) తిరుగుతూ ఉంటాయని మీరు చదువుకునే ఉంటారు. అలాంటి ఓ గ్రహ శకలమే అపోఫిస్. 4.5 కోట్ల టన్నుల బరువుతో, రెండు ఫుట్‌బాల్ మైదానాలంత పెద్దగా ఉండే ఈ గ్రహ శకలం సూర్యుడి చుట్టూ గంటకు 45 వేల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోంది.

ఈ గ్రహశకలాలలో కొన్ని అప్పుడప్పుడూ మన భూమికి చాలా దగ్గరగా వస్తుంటాయి. ఇలా వస్తున్న క్రమంలో అవి విపరీతమైన వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించి భూమిని ఢీకొంటుంటాయి. వీటిలాగే అపోఫిస్ భూమిని ఢీకొంటుందా? అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం..!

మరో 21 సంవత్సరాల తరువాత ఈ అపోఫిస్ మన భూమికి చాలా దగ్గరగా వస్తుంది. భూమికి ఎంత దగ్గరగా అంటే... దానికి భూమికి మధ్య కేవలం 39 వేల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేంత దగ్గరగా వస్తుంది. అప్పుడు ఎలాంటి పరికరాల సాయం లేకుండానే నేరుగా మన కళ్ళతో దాన్ని స్పష్టం చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమికి అంత దగ్గరగా వచ్చే ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎంతో కొంత మేరకు తప్పకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అదే సమయంలోనే అపోఫిస్ భూమిని ఢీకొట్టకుండా ఏమేం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దిశగా, గట్టి ప్రయత్నాలను వారు మొదలెట్టేశారు కూడా. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండవచ్చు.
మరిన్ని
ఏనుగులకు లెక్కలొచ్చట...!
ఉరితాడునే పూమాలగా ధరించిన భగత్‌సింగ్..!
మీకివి తెలుసా...?!
పిరమిడ్ల (మమ్మీలు) కథ..!
మీకివి తెలుసా...?!
ప్రకృతిలో విచిత్ర జంతువు "వాల్‌రస్"